Samsung Galaxy F13 : శాంసంగ్ నుంచి గెలాక్సీ F సిరీస్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్!
Samsung Galaxy F13 : శాంసంగ్ ఇండియా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. లాంచ్ కాకముందే ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో గెలాక్సీ F సిరీస్ ఫోన్ లిస్టింగ్ అయింది.

Samsung Galaxy F13 : శాంసంగ్ ఇండియా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. లాంచ్ కాకముందే ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో గెలాక్సీ F సిరీస్ ఫోన్ లిస్టింగ్ అయింది. Samsung Galaxy F13 ఫోన్ రాబోతోందని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. శాంసంగ్ బ్రాండ్ నుంచి బడ్జెట్ ఆఫర్ కావచ్చు. యూరప్‌లో లాంచ్ అయిన గెలాక్సీ M13 స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్ అంటూ నివేదిక తెలిపింది. Flipkartలో లిస్ట్ అయిన Samsung Galaxy F13 వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్ప్లేను కలిగి ఉండనుంది. బ్లూ కలర్ వేరియంట్లో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. శాంసంగ్ F13 డివైజ్ గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ SM-E135Fతో రానున్నట్టు ఇప్పటికే రివీల్ అయింది.
కంపెనీ ఇంటర్నల్ Exynos 850 SoCతో Android 12 OSలో రన్ అవుతుందని లిస్టింగ్ సూచించింది. 4GB RAM ఆప్షన్ తో వస్తోంది. ఈ డివైజ్ డ్యూయల్ స్పీకర్లను 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా ప్యాక్ చేస్తుందని నివేదిక సూచించింది. వాస్తవానికి Galaxy M13 రీబ్రాండెడ్ వెర్షన్ అయితే.. రాబోయే Samsung Galaxy F సిరీస్ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Samsung Galaxy F13 6.6-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. Full HD+ రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది.

Samsung Galaxy F13 Set To Launch In India Soon, Gets Listed On Flipkart
ఎక్సినోస్ 850 చిప్సెట్తో పనిచేస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజీ సపోర్టు ఇస్తుంది. 50-MP ప్రైమరీ సెన్సార్, 5-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-MP సెన్సార్ వంటి వెనుకవైపు 3 కెమెరాలను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP సెన్సార్ ఉంది. ఈ డివైజ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం లేదు. సరసమైన ఫోన్లతో రాకపోవచ్చు. కంపెనీ అందించే రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. Samsung చాలా ఫోన్లతో రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం నిలిపివేసింది. Samsung Galaxy F13 అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. కంపెనీ లాంచ్ తేదీని త్వరలోనే వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
Read Also : Samsung 4K Neo TV : అలెక్సా సపోర్టుతో శాంసంగ్ 4K నియో టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
1Ketika Sharma : రంగరంగ వైభవంగా.. కేతిక ఏంటమ్మా ఇంత అందంగా..
2Russian Gold Ban : అగ్ర దేశాల నుంచి ఆంక్షలు..పెరుగుతున్న వడ్డీలు..100 ఏళ్ల తరువాత పీకల్లోతు సమస్యల్లో రష్యా
3Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
4Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని
5Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..
6Russia-ukraine war : రష్యాపై ఆంక్షల ఉచ్చు బిగించిన G-7 దేశాలు..బంగారం దిగుమతిపై నిషేధం..భారత్ పై ప్రభావం
7Ts Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఎప్పుడంటే..
8P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’
9Covid Cases: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
10Samantha : ఊ అంటావా.. ఊఊ అంటావా.. సాంగ్ ఇన్స్పైర్ చేసింది అంటున్న సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
-
Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?