Samsung Galaxy M04 : డిసెంబర్ 9న శాంసంగ్ గెలాక్సీ M04 4G స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ధర ఎంత, ఏయే ఫీచర్లు ఉండొచ్చు.. అమెజాన్ రివీల్ చేసిందిగా..!

Samsung Galaxy M04 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి (Samsung) డిసెంబర్ 9న భారత మార్కెట్లోకి కొత్త ఎంట్రీ-లెవల్ 4G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

Samsung Galaxy M04 : డిసెంబర్ 9న శాంసంగ్ గెలాక్సీ M04 4G స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ధర ఎంత, ఏయే ఫీచర్లు ఉండొచ్చు.. అమెజాన్ రివీల్ చేసిందిగా..!

Samsung Galaxy M04 India launch date, price and other details confirmed by Amazon

Samsung Galaxy M04 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి (Samsung) డిసెంబర్ 9న భారత మార్కెట్లోకి కొత్త ఎంట్రీ-లెవల్ 4G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తమ ప్లాట్‌ఫారంలో శాంసంగ్ గెలాక్సీ M04 (Samsung Galaxy M04) స్మార్ట్‌ఫోన్ అధికారిక ప్రకటనకు ముందే కీలక వివరాలను వెల్లడించింది. ఈ డివైజ్ ధర రూ. 10వేల లోపు ఉంటుంది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టుతో వస్తుంది. ఈ 4G స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇందులో ఎలాంటి కొత్త డిజైన్ ఉన్నట్లు కనిపించడం లేదు. Samsung బడ్జెట్ ఫోన్‌లలో ఎక్కువగా చూసిన సాధారణ డిజైన్‌తోనే రాబోతోంది. Samsung Galaxy M04 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్-స్టైల్ నోచ్డ్ డిస్‌ప్లేతో వస్తుందని లీక్ డేటా వెల్లడించింది. అలాగే డిస్‌ప్లే చుట్టూ సన్నని బెజెల్స్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M04 ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదని చెప్పవచ్చు. అంటే.. సైడ్-మౌంటెడ్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. అమెజాన్ లిస్టింగ్‌లో డివైజ్ చిప్‌సెట్ పేరును వెల్లడించలేదు. ఈ హ్యాండ్‌సెట్ “సూపర్ ఫాస్ట్” పనితీరును అందిస్తుందని సూచిస్తుంది.

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో ఐఫోన్ 14 ఫీచర్ వస్తోంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లాంచ్ ఎప్పుడంటే?

శాంసంగ్ గెలాక్సీ M04 స్పెషిఫికేషన్లు (అంచనా) :

ఎంట్రీ-లెవల్ ఫోన్, హుడ్ కింద పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను అందిస్తుందని భావించవచ్చు. Galaxy M04 ఎంట్రీ-లెవల్ MediaTek Helio G35 చిప్‌తో రానుందని నివేదిక సూచించింది. బ్యాటరీ, కెమెరా గురించిన వివరాలు ప్రస్తుతానికి తెలియవు. Galaxy M04 128GB స్టోరేజీ, 8GB వరకు RAM ఆప్షన్‌తో చెప్పవచ్చు. RAM Plusకి సపోర్టుతో రానుంది.

Samsung Galaxy M04 India launch date, price and other details confirmed by Amazon

Samsung Galaxy M04 India launch date, price and other details

అమెజాన్ లిస్టు ప్రకారం.. శాంసంగ్ ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్‌తో రెండు ఏళ్ల OS అప్‌గ్రేడ్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఎందుకంటే అనేక బ్రాండ్‌లు తక్కువ ధర పరిధిలో ఒక ఏడాది మాత్రమే సపోర్టును అందిస్తాయి. ఈ డివైజ్ Android 12 OSతో రానుంది. ఆండ్రాయిడ్ 13 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, శాంసంగ్ సరికొత్త 4G ఫోన్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. శాంసంగ్ Galaxy M04 కొనుగోలు చేసే వినియోగదారులు వచ్చే ఏడాది Android 14 OSని కూడా పొందవచ్చు.

రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. Samsung Galaxy M04 ప్రారంభ ధర సుమారు రూ. 8వేలు లేదా రూ. 9వేలు వరకు ఉంటుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు Samsung Galaxy M04 లాంచ్ తర్వాత అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ సహా రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Android 13 : శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ రిలీజ్.. ఏయే డివైజ్‌ల్లో వచ్చింది..? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?