Samsung Galaxy M13 5G : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫీచర్లు లీక్.. త్వరలో ఇండియాకు..!

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. ఈ శాంసంగ్ M13 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాకముందే ఫీచర్లు లీక్ అయ్యాయి.

Samsung Galaxy M13 5G : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫీచర్లు లీక్.. త్వరలో ఇండియాకు..!

Samsung Galaxy M13 5g Specifications Leak Online, Expected To Launch In India Soon

Samsung Galaxy M13 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. అయితే ఈ శాంసంగ్ M13 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాకముందే ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ నుంచి 4G వెర్షన్ ఆవిష్కరించింది. 5G మోడల్‌ను బ్రాండ్ నుంచి బడ్జెట్ ఆఫర్ కింద తీసుకొస్తోంది. ఇంతలోనే ఈ డివైజ్ ఫీచర్లు లీకయ్యాయి. భారీ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎక్సినోస్ చిప్, 5,000mAh బ్యాటరీతో రానున్నట్టు లీకైన డేటా తెలిపింది. శాంసంగ్ 5G మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తుందా లేదా అనేది రివీల్ చేయలేదు. కంపెనీ M13 4G మోడల్ ఇంకా భారత మార్కెట్లోకి రాలేదు. MySmartPrice నుంచి నివేదిక ప్రకారం.. Samsung రెండు మోడళ్లను భారతీయ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్‌తో Samsung ఫోన్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..

లీకైన స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేతో HD+ రిజల్యూషన్, 269nits పిక్సెల్ డెన్సిటీతో వస్తుందని నివేదిక పేర్కొంది. MediaTek డైమెన్సిటీ 700 చిప్ ద్వారా రన్ అవుతుంది. 6GB RAM, 128GB స్టోరేజీతో రానుంది. కంపెనీ ర్యామ్ ఫీచర్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఆప్టిక్స్ పరంగా.. శాంసంగ్ గెలాక్సీ M13 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50-MP ప్రైమరీ సెన్సార్, 2-MP సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలను తీసేందుకు 5-MP సెన్సార్ కూడా ఉంది. హుడ్ కింద.. 5,000mAh బ్యాటరీ ఉండవచ్చు. శాంసంగ్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌ను మాత్రమే అందిస్తుందని నివేదించింది. హ్యాండ్‌సెట్ బ్లూ, బ్రౌన్, గ్రీన్‌తో సహా 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని నివేదిక తెలిపింది.

Samsung Galaxy M13 5g Specifications Leak Online, Expected To Launch In India Soon (2)

Samsung Galaxy M13 5g Specifications Leak Online, Expected To Launch In India Soon 

గెలాక్సీ M13 4G మోడల్ స్పెసిఫికేషన్లు ఇవే :
ఈ ఫోన్ 4G మోడల్ ఇప్పటికే భారత బయటి దేశాల్లో అందుబాటులో ఉంది. 6.6-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. హుడ్ కింద శాంసంగ్ ఇంట్లో Exynos 850 SoCని కలిగి ఉంది. 4G మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50-MP ప్రైమరీ సెన్సార్, 5-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో.. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-MP కెమెరాను అందించారు. ఈ డివైజ్ 15W ఫాస్ట్ ఛార్జ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 4G వెర్షన్ ఆండ్రాయిడ్ 12 OSతో అందించనున్నాయి.

ధర ఎంతంటే? :
Samsung ఫోన్ల ధర రూ. 15,000 సెగ్మెంట్‌లోపు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం.. ముందున్న Samsung Galaxy M12 భారత మార్కెట్లో Flipkart ద్వారా రూ. 10,285కి విక్రయిస్తోంది. Galaxy M13 5G మోడల్ లాంచ్ తేదీని Samsung ధృవీకరించలేదు.

Read Also : Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?