Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. గెలాక్సీ M13 సిరీస్‌లో 4G, 5G స్మార్ట్ ఫోన్లు రానున్నాయి.

Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy M13, Galaxy M13 5g India Launch Date Announced, Specifications Confirmed (1)

Samsung Galaxy M13 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. గెలాక్సీ M13 సిరీస్‌లో 4G, 5G స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. భారత మార్కెట్లో Samsung Galaxy M13, Galaxy M13 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ నెల (జూలై) 14న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు.. Samsung కొన్ని కీలకమైన Samsung Galaxy M13 5G, Galaxy M13 స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. Galaxy M13 4G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కెమెరా సెన్సార్ల గురించి కంపెనీ ఎలాంటి వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఫీచర్లు ఉంటాయని లీకైన డేటా సూచిస్తోంది. గెలాక్సీ M13 4G 6000 mAh బ్యాటరీతో రానుందని Samsung ధృవీకరించింది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దీనికి అదనంగా.. అమెజాన్ ఇండియా మైక్రోసైట్ ఫోన్ కనీసం రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని వెల్లడించింది. అందులో Galaxy M13 5G గ్రీన్, డార్క్ బ్లూ రెండు కలర్లు ఉన్నాయి. మరోవైపు, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Samsung Galaxy M13 5Gతో 11 5G బ్యాండ్‌లకు కూడా సపోర్టును అందిస్తుంది.

Samsung Galaxy M13, Galaxy M13 5g India Launch Date Announced, Specifications Confirmed

Samsung Galaxy M13, Galaxy M13 5g India Launch Date Announced, Specifications Confirmed

ఈ రెండు డివైజ్‌లు 12GB వరకు ర్యామ్‌ను అందించనున్నాయి. ఫిజికల్ ర్యామ్, ర్యామ్ ప్లస్‌తో వస్తుంది. వర్చువల్ ర్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ రెండు ఫోన్‌లు వాటర్-డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో రానున్నాయనిఅమెజాన్ ఇండియా మైక్రోసైట్ ధృవీకరించింది. MySmartPrice నివేదిక ప్రకారం.. Galaxy M13 5G 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో రానుంది. 4G వేరియంట్ Full HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల IPS LCDతో వస్తుంది. హుడ్ కింద, Galaxy M13 5G MediaTek డైమెన్సిటీ 700 SoCతో రానుంది.

Samsung M13 4G ఇంటర్నల్ కంపెనీ Exynos 850 చిప్‌సెట్‌తో రానుంది. ఈ ఫోన్‌లు 4GB/ 6GB RAM 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెండు డివైజ్‌ల ధర భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువగా ఉంటుందని అంచనా. అంటే.. Redmi Note 11, Moto G52, Realme 9i, Poco M4 స్మార్ట్ ఫోన్ల ధర పరిధిలో ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also : Samsung Galaxy M32 : భారత్‌లో గెలాక్సీ M32 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్..!