Samsung : గెలాక్సీ M సిరీస్‌‌లో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు

శామ్ సంగ్ గెలాక్సీ M సిరీస్ లో సరికొత్త ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్, M32 5G పేరిట కొత్త మిడ్ - బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.

Samsung : గెలాక్సీ M సిరీస్‌‌లో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు

M32

Samsung Galaxy M32 : కొత్త కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్నాయి పలు కంపెనీలు. తాజాగా…శామ్ సంగ్ గెలాక్సీ M సిరీస్ లో సరికొత్త ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్, M32 5G పేరిట కొత్త మిడ్ – బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.

Read More : Fake Challans : నకిలీ చలానాల స్కాంను చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు

అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లలో సెప్టెంబర్ 02వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులోని కెమెరా లెన్స్ వివిధ రింగ్ లలో సెట్ చేయడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999 ఉండగా, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 ఉంది.

Read More : Taliban Defence Minister: జైలు మాజీ ఖైదీయే అఫ్ఘాన్ రక్షణ మంత్రి

M32 5G స్పెసిఫికేషన్‌లు, కెమెరా :-
డ్యూయల్ సిమ్ కు సపోర్టు చేస్తుంది. ఫోన్ 6.5 అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత శామ్ సంగ్ OneUI3.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. ఫోన్ 8GB Ram, 128 GB వరకు స్టోరేజ్ చేసుకొనే అవకాశం ఉంది. అక్టా – కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ ఉంది. 60HZ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇక గెలాక్సీ M32 5G కెమెరాలో సెల్ఫీ, వీడియా కాలింగ్ కోసం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఏర్పాటు చేశారు. 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంది.

Read More : Sec-Bad : ఇక ఇంటి వద్దకే గణపతి ప్రసాదం, నవరాత్రి ఉత్సవాల వేళ ప్రత్యేక ఏర్పాట్లు

శామ్ సంగ్ గెలాక్సీ M32 5G కనెక్టివిటీ
ఈ ఫోన్ పరిమాణం 164.2×76.1×9.1mm. డాల్బీ అటామ్ సపోర్టు అందించారు. ఇది 5G, Wi-Fi, బ్లూటూత్, GPS వంటి ఫీచర్లున్నాయి. ఇది 5,000mAh బ్యాటరీ ఉంది. 15w ఫాస్ట్ ఛార్జర్ తో ఉంటుంది.