Samsung Galaxy M32 : భారత్‌లో గెలాక్సీ M32 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్..!

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M32 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు గెలాక్సీ M32 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy M32 : భారత్‌లో గెలాక్సీ M32 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్..!

Samsung To Launch A New Galaxy M Smartphone In India On July 5 (2)

Samsung Galaxy M32 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M32 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు గెలాక్సీ M32 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డివైజ్ Samsung అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 12,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ M32 అసలు ధర రూ. 14,999 నుంచి రూ. 12,999కు తగ్గింది. అంటే.. ఈ ఫోన్‌పై కంపెనీ ధర రూ.2,000 తగ్గించింది. అమెజాన్ కూడా అదే ధరకు హ్యాండ్‌సెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని పేర్కొంది. అయితే Galaxy M32 ఫోన్ ధర 4GB RAM+64GB స్టోరేజ్ మోడల్‌గా రానుంది.

Samsung Galaxy M32 జూన్ 2021లో లాంచ్ అయింది. ఈ డివైజ్‌లో 6,000mAh బ్యాటరీ, MediaTek Helio G80 SoC, AMOLED స్క్రీన్, 64-MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్జెట్ శాంసంగ్ ఫోన్ కొనదగినదేనా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాంసంగ్ Galaxy M32 అనేది ఆల్ రౌండర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ కొనుగోలు చేయాలంటే.. స్పష్టమైన AMOLED స్క్రీన్‌ కలిగి ఉంది. మంచి డైనమిక్ రేంజ్ కెమెరాలతో వచ్చింది. హుడ్ కింద భాగంలో భారీ 6,000mAh బ్యాటరీని అమర్చారు.

Samsung To Launch A New Galaxy M Smartphone In India On July 5 (3)

Samsung To Launch A New Galaxy M Smartphone In India On July 5 

సాధారణ వినియోగంతో ఒక రోజు కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించనుంది. అదే 4G మోడల్ లేదా 5G వెర్షన్‌ను కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది అయితే ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్‌ కలిగి ఉంది. పెద్ద బ్యాటరీతో రావడం ప్లస్ పాయింట్.. కాకపోతే స్లో ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇది కొంచెం వినియోగదారులను నిరాశపర్చేలా ఉంది. 25W ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది.

రిటైల్ బాక్స్‌లో 15W అడాప్టర్‌ను మాత్రమే అందిస్తోంది. ఛార్జర్ ద్వారా బ్యాటరీని పూర్తిగా ఫుల్ చేయడానికి దాదాపు 2 గంటలు సమయం పడుతుంది. కనీసం 30W లేదా 65W ఛార్జర్‌లను ఉపయోగించిన వారికి సమస్యే.. అయినప్పటికీ, యూజర్లు ఈ ఫోన్ రాత్రిసమయంలో ఛార్జ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M32 Android 11 OSతో లాంచ్ అయింది. రాబోయే Android 13 OS అప్‌డేట్ ఇందులో రాదు. కానీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

Read Also : Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!