శాంసంగ్ నుంచి 3 కొత్త S21 మోడల్ ఫోన్లు.. పాలిష్డ్ డిజైన్, అట్రాక్టివ్ లుక్ అదర్స్

శాంసంగ్ నుంచి 3 కొత్త S21 మోడల్ ఫోన్లు.. పాలిష్డ్ డిజైన్, అట్రాక్టివ్ లుక్ అదర్స్

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ నుంచి మూడు కొత్త గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. 2021 ఏడాదిలో మొబైల్ మార్కెట్లో బెస్ట్ ఫోన్లలో ఒకటిగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అవే.. శాంసంగ్ గెలాక్సీ S21, శాంసంగ్ గెలాక్సీ S21ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రా మూడు మోడల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూడు S21 మోడల్ డిజైన్ ఫ్రంట్ సైడ్ స్ర్కీన్ సింగిల్ లెన్స్ పంచ్ హోల్ కెమెరాతో వచ్చాయి. గెలాక్సీ S21 అల్ట్రా మోడల్ మాత్రం కర్వడ్ డిస్ ప్లేతో వచ్చింది. మిగిలిన రెండు S21, S21ప్లస్ ప్లాట్ డిజైన్ తో వచ్చాయి.

డిజైన్ :
గెలాక్సీ S21 మోడల్.. చూడటానికి గ్లాస్టిక్ డిజైన్ తో వచ్చింది. ప్లాస్టిక్ అయినా గ్లాసు లుక్ లో అట్రాక్ట్ చేస్తోంది. S21 ప్లస్ లో ఎలాంటి డిజైన్ ఉందో క్లారిటీ లేదు. ఈ రెండు మోడల్ ఫోన్ల కంటే S21 అల్ట్రా ఫోన్ లో పెద్ద కెమెరా బ్లాక్ ఉంది. అన్ని మోడళ్లలో కెమరాలను లెఫ్ట్ టాప్ కార్నర్ లో అమర్చారు. మూడు మోడళ్ల సైజు చూస్తే.. గెలాక్సీ S21అల్ట్రా (165.1 x 75.6 x 8.9mm), గెలాక్సీ S21 ప్లస్ (161.5 x 75.6 x 7.8mm, 202g), గెలాక్సీ S21 (151.7 x 71.2 x 7.9mm, 172g) పరిమాణంతో వచ్చాయి.
స్ర్కీన్ :
శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రా మోడల్ ఫోన్ 6.8అంగుళాల కర్వడ్ (1440 x 3200 (WQHD+) స్కీన్ అమర్చారు. రెండు మోడళ్లలో స్ర్కీన్ చిన్నగా తక్కువ రెజుల్యుషన్ కలిగి ఉంటాయి. గెలాక్సీ S21ప్లస్ 6.7 అంగుళాల ప్లాట్ స్ర్కీన్, గెలాక్సీ S21 మోడల్ 6.2అంగుళాల ప్లాట్ డిస్ ప్లే అందించింది. ఈ రెండు మోడల్ స్ర్కీన్ సైజు 1080 x 2400 (Full HD+) రెజల్యుషన్ అందించింది. రిఫ్రెష్ రేట్ 120Hz, QHD+ రెజుల్యుషన్ తో రన్ అవుతున్నాయి. మూడింటిలో Dynamic AMOLED 2X డిస్ ప్లేతో పాటు ఇన్ స్ర్కీన్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.
కెమెరాలు :
శాంసంగ్ గెలాక్సీ S21, S21ప్లస్ ఫోన్లలో కెమరాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ట్రిపుల్ లెన్స్ సెటప్ అందించారు. 12MP f/1.8 ప్రైమరీ కెమెరా, 12MP f/2.2 అల్ట్రావైడ్, 64MP f/2.0 టెలిఫొటో అందించింది. టెలిఫొటో స్నాపర్, 3x ఆప్టికల్ జూమ్, మెయిన్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (OIS) ఉంది. గెలాక్సీ S21 అల్ట్రాలో క్వాడ్ లెన్స్ కెమెరా 108MP f/1.8 మెయిన్ స్నాపర్, 12MP f/2.2 అల్ట్రా వైడ్ వన్, ఇందులో 10MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి.
బ్యాటరీ లైఫ్ :
శాంసంగ్ గెలాక్సీ S21లో 4,000mAh బ్యాటరీ అమర్చగా.. గెలాక్సీ S21 ప్లస్ లో 4,800mAh వన్, గెలాక్సీ S21 అల్ట్రాలో 5,000mAh పెద్ద బ్యాటరీ అమర్చారు. S21, S21ప్లస్ మోడల్ స్ర్కీన్ సైజు, బ్యాటరీతో చిన్నగా ఉండగా.. S21అల్ట్రాలో పెద్ద బ్యాటరీ ఉండటంతో బిగ్ స్ర్కీన్ తో వచ్చింది. ఈ మూడు ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తాయి. ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్, వైర్ లెస్ పవర్ షేర్ కూడా అందిస్తోంది.
ఫీచర్లు+ స్పెషిఫికేషన్లు :
గెలాక్సీ S21 మోడల్ ఫోన్లలో మూడింట్లో ఒకే చిప్ సెట్ ఉంది. అయితే దేశానికి బట్టి చిప్ సెట్ మారుతుంది. అమెరికా మోడళ్లలో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ అమర్చారు. యూకే, ఇతర రీజియన్లలో అయితే Exynos 2100 పవర్ ఫుల్ ప్రాసెసర్లు ఉంటాయి. గెలాక్సీ S21, గెలాక్సీ 21ప్లస్ ఫోన్లలో 8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజీ అమర్చారు. కానీ, S21అల్ట్రాలో మాత్రం 12GB లేదా 16GB RAM, అలాగే 128GB, 256GB లేదా 512GB స్టోరేజీ అందిస్తోంది. ఈ మూడు ఫోన్లలో 5G సపోర్టు చేస్తాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతున్నాయి.
ధర ఎంత? ఎక్కడ సేల్ :
శాంసంగ్ గెలాక్సీ S21 ప్రారంభ ధర ($799 / £769 / AU$1,249) ఉండగా, గెలాక్సీ S21ప్లస్ ప్రారంభ ధర ($999 / £949 / AU$1,549), శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రాలో ప్రారంభ ధర ($1,199 / £1,149 / AU$1,849) అందుబాటులో ఉన్నాయి. జనవరి 14 నుంచి ఈ మూడు మోడల్ ఫోన్లు ప్రీ ఆర్డర్ ప్రారంభమయ్యాయి. జనవరి 29న మొబైల్ మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి.