Samsung Galaxy S22 Price Cut : శాంసంగ్ గెలాక్సీ S22 ధర తగ్గిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు!
Samsung Galaxy S22 Price Cut : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) వినియోగదారులకు గుడ్‌న్యూస్.. శాంసంగ్ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి వచ్చిన Galaxy S23 సిరీస్ ధర భారీ తగ్గించింది. కంపెనీ పాత మోడళ్ల ధరలను కూడా తగ్గించింది.

Samsung Galaxy S22 Price Cut : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) వినియోగదారులకు గుడ్‌న్యూస్.. శాంసంగ్ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి వచ్చిన Galaxy S23 సిరీస్ ధర భారీ తగ్గించింది. కంపెనీ పాత మోడళ్ల ధరలను కూడా తగ్గించింది. Samsung Galaxy S22 సిరీస్ భారత్‌లో భారీ ధర తగ్గింపును పొందింది. ఈ ఫ్లాగ్‌షిప్ S22 ఫోన్ లాంచింగ్ ధర రూ. 72,999కి అందుబాటులోకి వచ్చింది.
అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోడల్ ధర ఇప్పుడు రూ. 57,999కి పడిపోయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale) ద్వారా ఈ ఫ్లాగ్‌షిప్‌ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. అంటే.. 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 52,900 కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ Galaxy S22 ధర తగ్గింపు.. కొనడం మంచిదేనా? :
Samsung Galaxy S22 సిరీస్ పాత 5G స్మార్ట్‌ఫోన్ మాదిరిగా ఉంటుంది. కానీ, ఈ డివైజ్ బెస్ట్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ లాంగ్ టైమ్ సపోర్టును అందిస్తామని హామీ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ సపోర్టు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ హ్యాండ్‌సెట్‌కు 4 ఏళ్ల ప్రధాన Android OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోవచ్చు.

Samsung Galaxy S22 price cut in India, is it worth buying in 2023
S22ని కొనుగోలు చేసేందుకు మరొక రీజన్ ఏమిటంటే.. కొత్త Galaxy S23 గత మోడల్ మాదిరిగానే ఉంటుంది. చాలా తక్కువ ధరలో అదే మోడల్ ఫీచర్లను పొందే అవకాశం ఉంది. చిప్‌సెట్, బ్యాటరీ మాత్రమే కొంచెం వ్యత్యాసం ఉంటుంది. మిగతా ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు వంటి మిగిలిన ఫీచర్లు రెండు డివైజ్‌లలో ఒకే విధంగా ఉంటాయి.

Samsung Galaxy S22 price cut in India, is it worth buying in 2023
కొత్త Galaxy S23 స్పీడ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్, హుడ్ కింద కొంచెం పెద్ద 3,900mAh బ్యాటరీ యూనిట్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కోరుకునే యూజర్లు Galaxy S22 ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సిరీస్ ఫోన్ చాలా చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. గెలాక్సీ S22 బ్యాటరీ లైఫ్ విషయంలోనూ కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ వినియోగం మితంగా ఉంటే పర్వాలేదు. కానీ, కనీసం రోజుకు రెండుసార్లు ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
శాంసంగ్ వినియోగదారులు బడ్జెట్ ఆధారంగా Samsung Galaxy S22+ ధర అమెజాన్‌లో రూ. 64,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 84,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మెరుగైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..