Samsung Galaxy S22 Series : శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్‌లో Android 13 OS అప్‌డేట్.. ఫోన్ కాల్స్ కోసం నోట్ ఫీచర్, మరెన్నో ఫీచర్లు

Samsung Galaxy S22 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఈ ఏడాదిలో ప్రారంభంలో లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S22 సిరీస్ ఫోన్‌ల కోసం సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌ను అందించింది. ట్విట్టర్, రెడిట్‌లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రావడానికి ముందే చాలా మంది యూజర్లు నివేదించారు.

Samsung Galaxy S22 Series : శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్‌లో Android 13 OS అప్‌డేట్.. ఫోన్ కాల్స్ కోసం నోట్ ఫీచర్, మరెన్నో ఫీచర్లు

Samsung Galaxy S22 series starts getting Android 13 OS update, brings note feature for calls, and more

Samsung Galaxy S22 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఈ ఏడాదిలో ప్రారంభంలో లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S22 సిరీస్ ఫోన్‌ల కోసం సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌ను అందించింది. ట్విట్టర్, రెడిట్‌లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రావడానికి ముందే చాలా మంది యూజర్లు నివేదించారు. ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా వన్ UI 5.0 అప్‌డేట్ యూజర్లకు మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించేందుకు అప్‌డేట్ ఆప్షన్లు, ఫీచర్‌లను అందిస్తుంది. అప్‌డేట్ 2.8GB సైజులో ఉంది.

అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు.. మీ డివైజ్‌లో తగినంత స్టోరేజీ స్పేస్ ఉండేలా చూసుకోండి. ఫర్మ్‌వేర్ వెర్షన్ S90xBXXU2BVJA, మెరుగైన మెటీరియల్ యు కలర్ స్కీమ్, నోటిఫికేషన్, కెమెరా కోసం ప్రైవసీ మోడ్, అద్భుతమైన ఫోటో పికర్, లాక్ స్క్రీన్ క్లాక్ సెటప్, మరిన్ని వంటి Android 13 ఫీచర్‌లను యాడ్ చేస్తుంది. Stackable విడ్జెట్‌లు, మెరుగైన Samsung ప్రైవసీ హబ్, కొత్త నోటిఫికేషన్‌ల UI, OCR మల్టీ టాస్కింగ్‌లతో ఎక్కడైనా గుర్తించడం కాల్‌ల సమయంలో నోట్ తీసుకోవడం వంటి కొన్ని అప్‌డేట్‌లను Samsung అందించింది.

Samsung Galaxy S22 series starts getting Android 13 OS update, brings note feature for calls, and more

Samsung Galaxy S22 series starts getting Android 13 OS update, brings note feature for calls, and more

Sammobile నివేదిక ప్రకారం.. Android 13 OS అప్‌డేట్ ఆస్ట్రియా, క్రొయేషియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, సెర్బియా, స్లోవేనియా, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్, యూకే వంటి ప్రాంతాలలో రిలీజ్ చేసింది. కంపెనీ ఇతర యూరోపియన్ దేశాలకు కూడా ఒక అప్‌డేట్ రిలీజ్ చేసింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ వారంలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. భారతీయ మార్కెట్‌కు కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

మీరు అప్‌డేట్స్ కోసం నోటిఫికేషన్‌ను అందుకోకుంటే.. మీరు సెట్టింగ్‌ల విభాగంలో మాన్యువల్‌గా చెక్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న ఏవైనా అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు ఫోన్ సెట్టింగ్‌ల విభాగానికి వెళ్లండి > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ > డౌన్‌లోడ్ వద్ద Tap చేయండి. Samsung Galaxy S22 సిరీస్ భారత్‌లో మార్చిలో రూ. 72,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దేశంలో ఈ డివైజ్ ధర రూ.52,999కి విక్రయిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : YouTube : యూట్యూబ్‌లో బిగ్ అప్‌డేట్.. పించ్-టు-జూమ్ ఫీచర్.. మీరు వీడియోను జూమ్ చేసి చూడవచ్చు..!