Samsung Galaxy S23 Series : స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 SoCతో గెలాక్సీ S23 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అదే.. Samsung Galaxy S23 సిరీస్ ఫోన్.. ఈ ఫోన లాంచ్ కావడానికి మరికొన్ని నెలల సమయం ఉంది.

Samsung Galaxy S23 Series : స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 SoCతో గెలాక్సీ S23 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy S23 Series Could Launch With Snapdragon 8 Gen 2 Soc Worldwide (1)

Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అదే.. Samsung Galaxy S23 సిరీస్ ఫోన్.. ఈ ఫోన లాంచ్ కావడానికి మరికొన్ని నెలల సమయం ఉంది. శాంసంగ్ నెక్ట్స్ Galaxy S-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరి 2022లో లాంచ్ చేసే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్ లాంచ్ సమయం మరో 6 నెలల సమయం ఉంది. ఇప్పటికే Galaxy S23 సిరీస్‌కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Samsung Galaxy S23 సిరీస్‌కు సంబంధించి మరో లీక్ బయటకు వచ్చింది. ఈ ఫోన్‌‌లో ప్రాసెసర్ ఆప్షన్ గురించి వివరాలు లీకయ్యాయి. మార్కెట్ విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రాసెసర్ వేరియంట్‌తో వస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో లాంచ్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Samsung Galaxy S23 Series Could Launch With Snapdragon 8 Gen 2 Soc Worldwide

Samsung Galaxy S23 Series Could Launch With Snapdragon 8 Gen 2 Soc Worldwide

Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCని నవంబర్ లేదా డిసెంబర్ 2022లో ప్రకటించే అవకాశం ఉంది. Qualcomm నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ ముందుగా Samsung సిరీస్‌లో కూడా ఉంటుందని భావిస్తున్నారు. Galaxy S23 లైనప్ మూడు కొత్త మోడళ్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇందులో.. గెలాక్సీ S23, గెలాక్సీ S23 ప్లస్, గెలాక్సీ S23 అల్ట్రా ఉన్నాయి. సాధారణంగా S-సిరీస్ ఫ్లాగ్‌షిప్‌లను Qualcomm, Exynos చిప్‌సెట్‌లతో లాంచ్ చేస్తుంది. అయితే, ఎక్సినోస్ 2300 SoC పనితీరుపై దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అంత నమ్మకంగా లేదని Kuo పేర్కొంది. Galaxy S23 సిరీస్ Snapdragon 8 Gen 2 SoCని ఎంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లాంచ్ చేసేందుకు శాంసంగ్ కంపెనీ రెడీ అవుతోంది. ఆగస్టులో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు, కొత్త స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 SoCని కలిగి ఉంటాయి.

Read Also : Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 సిరీస్ 5G ఫోన్.. జూలై 14న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?