Samsung Galaxy Tab A8 : శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 లాంచ్.. అదిరేపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి 2021 ఏడాదిలో కొత్త ట్యాబ్ వస్తోంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Tab A8 (2021) ట్యాబ్‌ లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

Samsung Galaxy Tab A8 : శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 లాంచ్.. అదిరేపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?

Samsung Galaxy Tab A8 Samsung Galaxy Tab A8 2021 Launched In India

Samsung Galaxy Tab A8 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి 2021 ఏడాదిలో కొత్త ట్యాబ్ వస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Tab A8 (2021) ట్యాబ్‌ లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. రూ.20వేల సబ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, UniSoc చిప్ సెట్, క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంది. డిసెంబర్ 2021లోనే శాంసంగ్ ట్యాబ్ A8 అంతర్జాతీయంగా ఆవిష్కరించింది కంపెనీ. ఇప్పుడు భారత మార్కెట్లోకి ఇదే మోడల్ ట్యాబ్లెట్ తీసుకొచ్చేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది.

Galaxy Tab A8 (2021) ట్యాబ్ ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ.17,999గా ఉండనుంది. ఈ కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఈకామర్స్ ప్లాట్ ఫాంలైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ జనవరి 17న మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ట్యాబ్ A8 (2021) మోడల్ గ్రే, పింక్ గోల్డ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Samsung Galaxy Tab A8 (2021) ఫీచర్ల విషయానికి వస్తే.. ఆక్టా కోర్ UniSoC T618 ప్రాసెసర్‌తో Mali G52 MP2 GPUతో కలిసి వస్తోంది. Galaxy Tab A8 10.5″ LCD డిస్ ప్లేతో వస్తోంది. ఈ ట్యాబ్ మూడు స్టోరేజీ ఆప్షన్లతో వస్తోంది. 3/32GB, 4/64GB, 4/128GB. 8 MP కెమెరాతో పాటు వీడియో కాల్ చేసుకోవచ్చు.

ఇక వెనుకవైపు 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పవచ్చు. GSM Arena ప్రకారం… Samsung Galaxy Tab A8 రెండు వెర్షన్లలో రానుంది. Wi-Fi-Only, LTEతో రానుంది. ఈ రెండింటిలోనూ 3.5mm ఆడియో జాక్, 7,040 mAh బ్యాటరీ ఛార్జ్, USB-C పోర్ట్ ఉన్నాయి. Galaxy Tab A8 ప్రారంభ ధర రూ. 17,999గా ఉంటుందని అంచనా.

Read Also : Baby Shark: యూట్యూబ్ లో 10 బిలియన్ వ్యూస్ తో “బేబీ షార్క్” సెన్సేషన్