Foldable Phones : శాంసంగ్ నుంచి మడత ఫోన్లు వస్తున్నాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

సౌత్‌ కొరియన్ దిగ్గజం శాంసంగ్‌ నుంచి మడతబెట్టే (Foldable) స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఆగస్టు 20న భారత మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

Foldable Phones : శాంసంగ్ నుంచి మడత ఫోన్లు వస్తున్నాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

Samsung Galaxy Z Fold 3, Galaxy Z Flip 3 Teased To Launch In India On August 20

Samsung Foldable Phones : సౌత్‌ కొరియన్ దిగ్గజం శాంసంగ్‌ నుంచి మడతబెట్టే (Foldable) స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. ఆగస్టు 20న భారత మార్కెట్లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. బాలీవుడ్ నటీ ఆలియా బట్ చేతుల మీదుగా శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు రిలీజ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. భారత మార్కెట్ మినహా ప్రపంచ మార్కెట్లోకి ఆగస్టు 11నే శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో Samsung Galaxy Z Fold 3, Galaxy Z Flip 3 లాంచ్ అయ్యాయి. శాంసంగ్ నుంచి గెలాక్సీ బడ్స్‌ 2, గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌లను కూడా రిలీజ్ చేసింది. ఈ కొత్త Galaxy Z ఫోన్లు ఎంపిక చేసిన మార్కెట్లలోనే గ్లోబల్ ప్రైస్ కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లోకి అతి త్వరలో ఈ ఫోల్డబుల్ ఫోన్లను కంపెనీ రిలీజ్ చేయనుంది.

Samsung Foldable Phones

ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ Z Fold 3, Galaxy Z Flip 3 ఫోల్డబుల్ ఫోన్లలో Microsoft Apps అయిన Microsoft Office, Teams Outlook కూడా సపోర్ట్ చేయనున్నాయి. అలాగే Multi-Active window కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఈ ఫోల్డబుల్ శాంసంగ్ ఫోన్లలో సగం స్ర్కీన్ ఓపెన్ చేసినా యూజర్లు ఒకే సమయంలో రెండు యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు.

శాంసంగ్ ఫోల్డబుల్ ఫీచర్ల విషయానికి వస్తే..
శాంసంగ్‌ Galaxy Z Fold 3 ఫోన్‌ బుక్‌ మాదిరిగా ఉంటుంది. ఈ ఫోన్‌ టాబ్‌లా లేదా ఫోన్‌లా వినియోగించుకోవచ్చు. శాంసంగ్ ఫ్లాగ్ షిప్ Galaxy Z Fold 3 ఫీచర్లలో 7.6 అంగుళాల Infinity ఫ్లెక్స్ డిస్‌ప్లే ((ఫోల్డ్ చేయకుండా)తో వస్తోంది. ఈ ఫోన్ బయటవైపు స్ర్కీన్ 6.2 అంగుళాల Super AMOLED డిస్ ప్లే అందిస్తోంది. 2,260×832 pixels రెజుల్యుషన్, 120Hz refresh రేట్ అందిస్తోంది.

Samsung Foldable Phones

బయటివైపు 12MP కెమెరాలు, లోపలివైపు 10MP సెన్సార్, 4MP సెకండరీ అండర్ డిస్ ప్లే కెమెరాలతో యూజర్లను అట్రాక్ట్ చేయనుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర $1,799.99 (Rs. 1,33,700)గా ఉండనుంది. ఫోల్డ్ 3 మోడల్ Phantom Black, Phantom Green, Phantom Silver కలర్ ఆప్షన్లలో వస్తోంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంతో కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
Samsung Galaxy : శాంసంగ్ బిగ్ ఈవెంట్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌, వాచ్, ఇయర్​బడ్స్​ లాంచ్ నేడే!

మరో మోడల్.. Samsung Galaxy Z Flip 3 ఫీచర్లలో 6.7 అంగుళాల Dynamic AMOLED ఫోల్డబుల్ మెయిన్ డిస్ ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటుతో రానుంది. వెలుపల స్ర్కీన్ 1.9 అంగుళాల డిస్ ప్లే ( 260×512 pixels) రెజుల్యుషన్ తో వస్తోంది. నోటిఫికేషన్లను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫోన్ ప్రారంభ ధర గ్లోబల్ మార్కెట్లో $999.99 (Rs. 74,300)ల వరకు ఉండొచ్చునని అంచనా.