Samsung : శాంసంగ్ నుంచి సరసమైన ధరకే మరో గెలాక్సీ A సిరీస్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Galaxy A series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో కొత్త Galaxy A Series స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే.. Samsung Galaxy A04s. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో మాత్రమే వస్తుంది.

Samsung : శాంసంగ్ నుంచి సరసమైన ధరకే మరో గెలాక్సీ A సిరీస్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung launches another affordable Galaxy A series smartphone in India

Samsung Galaxy A series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో కొత్త Galaxy A Series స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే.. Samsung Galaxy A04s. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Samsung.com, ప్రధాన ఈ-కామర్స్ పోర్టల్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. సరసమైన ధర ట్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ ఏమి ఆఫర్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. Samsung Galaxy A04s స్పెసిఫికేషన్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

Samsung launches another affordable Galaxy A series smartphone in India

Samsung launches another affordable Galaxy A series smartphone in India

అందులో 6.5-అంగుళాల 90Hz HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో 20:9 యాస్పెక్ట్ రేషియోతో వచ్చింది. ఈ ఫోన్‌లో 50-MP ప్రైమరీ సెన్సార్, 2-MP మాక్రో సెన్సార్, 2-MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5-MP కెమెరా ఉంది.

Samsung ఇంటర్నల్‌గా చెందిన ఆక్టా-కోర్ Exynos 850 చిప్‌సెట్‌తో పాటు 4GB RAM (8GB వరకు RAM), 64GB ఇంటర్నల్ స్టోరేజీతో అందించింది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీ పెంచుకునేందుకు సపోర్టు కూడా అందిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఫ్రంట్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా వన్ UI కోర్‌తో రన్ అవుతుంది. Samsung Galaxy A04s 5,000mAh బ్యాటరీతో వచ్చింది.

Samsung launches another affordable Galaxy A series smartphone in India

Samsung launches another affordable Galaxy A series smartphone in India

ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. ఈ డివైజ్ కొన్ని ఇతర ఫీచర్లు, పవర్ బటన్‌పై ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్‌కు సపోర్టు, ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. శాంసంగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వన్ కార్డ్, స్లైస్ కార్డ్‌తో భాగస్వామ్యమై రూ. 1000 క్యాష్‌బ్యాక్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 12499కి తగ్గించింది. స్మార్ట్‌ఫోన్ బ్లాక్, కాపర్, గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy Phones : తగ్గేదేలే.. ఆపిల్‌కు పోటీగా శాంసంగ్.. ఐఫోన్ల తర్వాత గెలాక్సీ ఫోన్లలోనూ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్..!