Samsung OLED Smart TV : శాంసంగ్ కొత్త OLED స్మార్ట్‌టీవీ వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతంటే?

Samsung OLED Smart TV : శాంసంగ్ న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్ 4Kతో కొత్త మేడ్-ఇన్-ఇండియా OLED TV సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ రేంజ్ S95C, S90C అనే రెండు సిరీస్‌లను అందిస్తుంది.

Samsung OLED Smart TV : శాంసంగ్ కొత్త OLED స్మార్ట్‌టీవీ వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతంటే?

Samsung launches new OLED smart TVs in India starting at Rs 1.7 lakh

Samsung OLED Smart TV : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవలే భారత మార్కెట్లో కొత్త రేంజ్ OLED TVలను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌టీవీ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించింది. కొత్త OLED TV రేంజ్‌లో అన్ని మోడళ్లను భారత్‌లో తయారు చేసినట్లు శాంసంగ్ ప్రకటించింది. న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4Kని కలిగి ఉంది.

ఈ రేంజ్ రెండు సిరీస్ స్మార్ట్‌టీవీలు ఉన్నాయి. ఇందులో S95C, S90C వంటి ధరలు రూ. 1,69,990 నుంచి ప్రారంభమవుతాయి. 2,030 పాంటోన్ కలర్లు, 110 స్కిన్ టోన్ షేడ్స్ కలిగి ఉంది. PANTONE నుంచి ధృవీకరణను పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటిగా కొత్త OLED TV శ్రేణిని లాంచ్ చేసిన సందర్భంగా శాంసంగ్ వెల్లడించింది. అదనంగా, టీవీలు EyeComfort మోడ్‌ను కలిగి ఉంటాయి. కాంతి పరిస్థితుల ఆధారంగా లైటింగ్ లెవల్ ఆటోమాటిక్‌గా ఎడ్జెస్ట్ చేస్తుంది.

స్మార్ట్ టీవీ లాంచ్‌పై శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా కొత్త రేంజ్ OLED టీవీలతో లాంచ్ మోడల్స్ మరింత విస్తరిస్తున్నాం. న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్ 4K OLED ద్వారా OLED టీవీలను మరింత మెరుగ్గా మార్చాం. బెస్ట్ ఫొటో క్వాలిటీ అందించడానికి ప్యానెల్‌ అందిస్తున్నాం. కొత్త OLED టీవీల ప్రారంభంతో ప్రీమియం టీవీ మార్కెట్‌లో మా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాయపడుతుంది’ అని ఆయన అన్నారు.

Read Also : Best Smartphones in June : ఈ జూన్‌లో భారత్‌లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఇప్పుడే కొనేసుకోండి..!

శాంసంగ్ OLED TV రేంజ్ ధర ఎంతంటే? :
శాంసంగ్ లేటెస్ట్ OLED TV శ్రేణిని ప్రవేశపెట్టింది. ఇందులో రెండు (S95C, S90C) సిరీస్‌లు ఉన్నాయి. రెండు సిరీస్‌లు మూడు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. 77-అంగుళాల, 65-అంగుళాలు, 55-అంగుళాలుగా ఉన్నాయి. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ. 169,990గా ఉంది. కస్టమర్‌లు ఈ టీవీలను భారత మార్కెట్లోని ప్రముఖ రిటైల్ స్టోర్‌ల నుంచి (Samsung.com)లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కస్టమర్ల కోసం శాంసంగ్ ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలుదారులు తమ కొనుగోలుపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, రూ. 2,990 నుంచి ప్రారంభమయ్యే EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని OLED TV మోడల్స్ 2 ఏళ్ల వారంటీతో వస్తాయి.

శాంసంగ్ OLED TV రేంజ్ స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ లేటెస్ట్ రేంజ్ OLED TVలను ఆవిష్కరించింది. న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4Kతో అత్యుత్తమ ఎంటర్‌టైన్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఈ అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్ AI- ఆధారిత అల్గారిథమ్‌లను సీన్ వారీగా కంటెంట్ వ్యూను విశ్లేషించవచ్చు. ప్రతి ఫ్రేమ్ HDR OLED+ టెక్నాలజీతో వచ్చింది. కొత్త శాంసంగ్ Smart TV రేంజ్ PANTONE నుంచి ధ్రువీకరణను పొందిన ప్రపంచంలోనే మొదటిదిగా గుర్తింపు పొందింది. 2,030 పాంటోన్ కలర్లు, 110 స్కిన్ టోన్ షేడ్స్ కలిగి ఉంది.

Samsung launches new OLED smart TVs in India starting at Rs 1.7 lakh

Samsung launches new OLED smart TVs in India starting at Rs 1.7 lakh

ఈ రేంజ్ EyeComfort మోడ్‌ను కలిగి ఉంది. శాంసంగ్ OLED TV రేంజ్ వైర్‌లెస్ డాల్బీ అట్మోస్, OTS+ టెక్నాలజీ కలిగి ఉంది. సౌండ్ క్వాలిటీ, వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇన్ఫినిటీ వన్ డిజైన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ ఫొటోను అందించడం ద్వారా ఇమ్మర్షన్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. ఈ బ్యాటరీ రహిత రిమోట్‌ని ఇండోర్ లైటింగ్ లేదా WiFi రూటర్‌ల వంటి వివిధ అప్లియన్సెస్ ద్వారా రిలీజ్ అయ్యే విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి కూడా ఛార్జ్ చేయవచ్చని శాంసంగ్ తెలిపింది.

గేమింగ్ ఔత్సాహికుల కోసం శాంసంగ్ OLED TV రేంజ్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. Motion Xcelerator Turbo Pro విజువల్స్, హై-స్పీడ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇన్‌పుట్ లాగ్, మోషన్ బ్లర్‌ను సమర్థవంతంగా తొలగిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, గేమ్ బార్, మినీ మ్యాప్ జూమ్, వర్చువల్ ఎయిమ్ పాయింట్ వంటి అదనపు ఫీచర్‌లతో, గేమర్‌లు థ్రిల్లింగ్ లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని పొందవచ్చు. కొత్త రేంజ్ OLED TVలు ఇంటర్నల్ IoT హబ్‌ను కలిగి ఉంటాయి.

Read Also : Apple iPhone 14 Sale : అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు..!