Samsung Foldable Phones : శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. ఇండియాలో ధర ఎంతంటే? మరెన్నో ఆఫర్లు, ఫ్రీ-ఆర్డర్లు మీకోసమే..!

Samsung Foldable Phones : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. గ్లోబల్ లాంచ్ తరువాత Samsung భారత మార్కెట్లో కొత్త ఫోల్డ్ ఫ్లిప్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.

Samsung Foldable Phones : శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. ఇండియాలో ధర ఎంతంటే? మరెన్నో ఆఫర్లు, ఫ్రీ-ఆర్డర్లు మీకోసమే..!

Samsung launches two new foldable phones in India check price and offers

Samsung Foldable Phones : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు (Samsung Foldable Phones) వచ్చేశాయి. గ్లోబల్ లాంచ్ తరువాత Samsung భారత మార్కెట్లో కొత్త ఫోల్డ్ ఫ్లిప్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్‌ల్లో Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 మోడల్స్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ప్రారంభ ధర రూ. 1,54,999గా ఉండగా.. శాంసంగ్ గెలాక్సీ Z Flip 4 ప్రారంభ ధర రూ. 89,999గా నిర్ణయించాయి. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ప్రీ-ఆర్డర్లతో అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy Z Flip 4 price in India :

ఈ డివైజ్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. అందులో 8GB+128GB వేరియంట్, 8GB+256GB రెండో వేరియంట్. అలాగే 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర రూ. 89,999కి అందుబాటులో ఉంది. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.94,999గా ఉంది. బెస్పోక్ ఎడిషన్ ఎడిషన్ గ్లాస్ కలర్స్, ఫ్రేమ్ ఆప్షన్‌లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. Samsung Live, Samsung ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో రూ.97,999కి అందుబాటులో ఉంటాయి. బోరా పర్పుల్, గ్రాఫైట్ పింక్ గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Samsung launches two new foldable phones in India check price and offers

Samsung launches two new foldable phones in India check price and offers

Samsung Galaxy Z Fold 4 price in India :

శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 మొత్తం మూడు వేరియంట్లలో వస్తుంది. అందులో 12GB+256GB, 12GB+512GB, 12GB+1TB వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ల ధర విషయానికొస్తే.. 256GB స్టోరేజీతో Galaxy Z Fold 4 ధర రూ. 1,54,999గా అందుబాటులో ఉంది. వరుసగా రూ. 1,64,999, రూ. 1,84,999 ధరలకు 512GB, 1TB మోడల్‌ ఫోన్లు లభిస్తాయి. ఈ ఫోన్ గ్రేగ్రీన్, బీజ్, ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

లాంచ్ ఆఫర్లు ఇవే (Launch Offers) :

Galaxy Z Fold 4 డివైజ్ కోసం ప్రీ-బుక్ చేసే వినియోగదారులు రూ. 34999 విలువైన Galaxy Watch4 క్లాసిక్ 46mm BTని కేవలం రూ. 2999తో పొందవచ్చు. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో షాపింగ్‌పై రూ. 8,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా Samsung అందిస్తోంది. అంతేకాదు అప్‌గ్రేడ్ బోనస్‌లను రూ. 8000 వరకు కూడా పొందవచ్చు. Galaxy Z Flip 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్‌లు Galaxy Watch4 Classic 42mm BTని రూ. 31999 విలువతో కేవలం రూ. 2999తో సొంతం చేసుకోవచ్చు.

Samsung launches two new foldable phones in India check price and offers

Samsung launches two new foldable phones in India check price and offers

అదనంగా, వినియోగదారులు HDFC Credit Card లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 7000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. లేదంటే రూ. 7000 అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందవచ్చు. ప్రీ-బుక్ కస్టమర్‌లు కేవలం రూ. 6000తో రూ. 11999 విలువైన ఒక ఏడాది పాటు Samsung Care Plus కూడా పొందవచ్చు. 24 నెలల వరకు No Cost EMI ఆఫర్‌ను కూడా ఎంచుకోవచ్చు.

ఆగస్టు 17 అర్ధరాత్రి లోపు Samsung లైవ్‌లో Galaxy Z Flip 4, Galaxy Z Fold 4 కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 5199 విలువైన Wireless Charger Duoని ఉచితంగా పొందవచ్చునని శాంసంగ్ ప్రకటించింది. ఇప్పుడు, ఆగస్ట్ 17 అర్ధరాత్రి లోపు Samsung లైవ్‌లో Galaxy Z Flip 4 బెస్పోక్ ఎడిషన్ కొనుగోలు చేస్తే.. కస్టమర్‌లు వైర్‌లెస్ ఛార్జర్ డ్యుయోతో పాటు రూ. 2,000 విలువైన స్లిమ్ క్లియర్ కవర్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా, Samsung.com లేదా Samsung Exclusive స్టోర్‌లలో Pre-Booking ద్వారా ఈ Samsung Live ఆఫర్‌లను పొందవచ్చు.

Read Also : Samsung Galaxy Z Fold 4 : శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 సిరీస్ వస్తోంది.. లాంచ్ డేట్ లీక్..!