SBI, HDFC కస్టమర్లకు అలర్ట్ : జూన్ 30లోగా ఆధార్-పాన్ లింక్ చేయండి.. లేదంటే సర్వీసులు బంద్!

పర్మినెంట్ నెంబర్ (పాన్)ను ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారనున్నాయి. జూన్ 30 తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు.

SBI, HDFC కస్టమర్లకు అలర్ట్ : జూన్ 30లోగా ఆధార్-పాన్ లింక్ చేయండి.. లేదంటే సర్వీసులు బంద్!

Sbi, Hdfc Customers Follow This Rule By June Or Banking Services To Be Hit

SBI, HDFC Customers: పర్మినెంట్ నెంబర్ (PAN)ను ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారనున్నాయి. జూన్ 30 తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు. అందుకు ప్రతిఒక్కరూ నిర్ణీత గడువు తేదీలోగా పాన్-ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని వ్యక్తి గడువు ముగిసిన తర్వాత నుంచి పనిచేయదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA లోని 41వ నిబంధన ప్రకారం.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డు నెంబర్ లింక్ చేసుకోవాలి. ఈ రూల్ తప్పక పాటించాల్సిందిగా ఇప్పటికే పలు బ్యాంకులు తమ కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి.

లేదంటే బ్యాంకు సేవలు నిలిచిపోతాయని సూచిస్తున్నాయి. బ్యాంకు సేవలు కొనసాగాలంటే తప్పనిసరిగా ఆధార్-పాన్ నిర్దేశిత గడువులోగా లింక్ చేసుకోవాలని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ట్విట్టర్‌లో తమ కస్టమర్లను పేర్కొంది. ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన, పర్మినెంట్ నెంబర్ (పాన్) పది అంకెలు ఉంటాయి.. ఇదో ఆల్ఫాన్యూమరిక్ నెంబర్.. పన్ను ఎగవేత, మోసాలను నివారించడానికి ఇది అవసరం.. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన అన్ని ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉంటుంది. వచ్చే నెల నుంచి బ్యాంకు సేవలు పొందాలంటే సంబంధిత ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్-పాన్ ఆధార్ వివరాలను లింక్ చేయాలని వినియోగదారులను కోరుతున్నాయి.

లేదంటే పాన్ పనిచేయదు.. అలాగే బ్యాంకు సర్వీసులు కూడా నిలిచిపోతాయని బ్యాంకులు అలర్ట్ చేస్తున్నాయి. బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, ఇతర విషయాలతోపాటు డీమాట్ ఖాతాను ప్రారంభించడం వంటి వాటికి పాన్ కార్డ్ తప్పనిసరి. ఒక వ్యక్తి ఒక రోజులో రూ. 50వేల కంటే ఎక్కువ నగదును బ్యాంకులో జమ చేస్తే.. పాన్ తప్పనిసరిగా జత చేయాలి. రూ. 50వేల కంటే ఎక్కువ విలువైన మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు మొదలైనవి కొనుగోలు చేసేటప్పుడు పాన్ వివరాలను అందించడం తప్పనిసరి. ఒక కస్టమర్ పాన్ వివరాలను అందించాలి.

బ్యాంకు డాక్యుమెంట్లు లేదా బ్యాంకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకు నుంచి ఆర్డర్లు లేదా బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేయడానికి ఏ ఒక్క రోజులోనైనా రూ. 50వేల కంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే పాన్ కార్డు తప్పక చూపించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి పాన్, ఆధార్‌తో లింక్ చేసుకోవడం ద్వారా బ్యాంకింగ్ సేవలను కొనసాగించవచ్చునని ఎస్‌బీఐ కోరింది. పాన్ ఆధార్ ఎస్‌ఎంఎస్ ద్వారా గడువును లింక్ చేయడం గురించి HDFC బ్యాంక్ తమ వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. బడ్జెట్ 2021లో, కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234Hను చేర్చింది. గడువు ముగిసిన తర్వాత పాన్, ఆధార్ అనుసంధానించకపోతే రూ .1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.