Scientist About Death: చావు అనేది లేదు.. స్పృహ కోల్పోతామంతే అంటున్న సైంటిస్ట్

విశ్వంలో మనిషి మెదడుకు అందని ప్రశ్న.. మానవ జీవితం. చాలా మంది కుతూహలంగా ఎదురుచూసేది.. అతి పెద్ద రహస్యమైంది చావే. అన్ని మతాలు చెప్పేదేంటంటే.. చావు అనేది మరణాంతర జీవితానికి బహుమతి లాంటిది.

Scientist About Death: చావు అనేది లేదు.. స్పృహ కోల్పోతామంతే అంటున్న సైంటిస్ట్

Man Travel

Scientist About Death: విశ్వంలో మనిషి మెదడుకు అందని ప్రశ్న.. మానవ జీవితం. చాలా మంది కుతూహలంగా ఎదురుచూసేది.. అతి పెద్ద రహస్యమైంది చావే. అన్ని మతాలు చెప్పేదేంటంటే.. చావు అనేది మరణాంతర జీవితానికి బహుమతి లాంటిది. భూమిపై గడిపిన జీవితానికి తగ్గట్లుగానే అక్కడ విలువ దొరుకుతుందని నమ్ముతుంటారు.

వీటిపై ఎటువంటి నిర్ధారణ రాలేదు కానీ, నిజం ఏంటనేది మరెవ్వరూ నిరూపించలేదు. అమెరికన్ మోడల్ డాక్టర్, సైంటిస్ట్ రాబర్ట్ లాంజా రాసిన పుస్తకంలో ఇంట్రస్టింగ్ విషయాలు రాసుకొచ్చారు. చావు అనే ముగింపు మరో ప్రపంచానికి మార్గం లాంటిదని పేర్కొన్నాడు.

బయోసెంట్రిజం
రాబర్ట్ ఉద్దేశ్యం ప్రకారం.. మనుషులు చేసిన పనుల వల్ల కలిగే ఫలితమే. అంతేకాకుండా అది మనుషులు పుట్టించింది కాదు మనుషుల పుట్టుకకు కారణమైందని అంటున్నారు.

లాంజా మరో మీడియాతో బయోసెంట్రిజం ఇలా చెప్తుందన్నాడు. స్పేస్, సమయం అనేవి మన మెదడులో సమాచారం ఒక అనుభవంగా మార్చడానికి ఉపయోగపడతాయని అన్నాడు. ఒక భాషలా ఉండి మనుగడ గురించి తెలియజేస్తుందట.

మనం విశ్వసించే చాలా ప్రపంచాల్లో చనిపోయినట్లుగా ఎక్కడా లేదు. ఒకేసమయంలో పలు చోట్ల మనం సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుందంటే బ్రెయిన్ లోని ఎనర్జీ మాత్రమే. చావు అనేది ప్రపంచపు స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం మీద టీవీ సిరీస్ ముగించినట్లే అవుతుంది. మనకు డిఫెరంట్ స్టోరీలు కనిపిస్తాయి. పలు క్యారెక్టర్లు, పలు ముగింపులు జీవితమనే లైబ్రరీలో మారుతూ ఉంటాయి. అవి ముగిసిపోవచ్చు కానీ, మనం అనేది మిగిలే ఉంటాం.

అతని లెక్క ప్రకారం.. ఎనర్జీ అనేది ఫిజిక్స్ నియమం, ఎనర్జీని సృష్టించలేం, నాశనం చేయలేం కాకపోతే రూపాంతరం చెందుతుందంతే. మనం చనిపోయినప్పుడు సమయం, ప్రదేశాలతో లింక్ తెగిపోతుంది. ఆ కాన్సెప్ట్ ప్రకృతికి అసలు ఏ మాత్రం సంబంధం ఉండదు.

ఆయన చెప్పినట్లు చావు అనేది టీవీ షో ముగిసినట్లేనా:
చావు అనేది టీవీ షో ముగిసినట్లేనని సైంటిస్టు చెబుతున్నట్లుగా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. సమయం ముగిసిపోతే చనిపోతామని లేదంటే తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు తుది శ్వాస విడిచినట్లుగా కన్ఫామ్ చేసుకుంటాం కానీ, సైంటిస్ట్ రాబర్ట్ చెప్పినట్లు ఎక్కడా నిరూపించలేదు.