Airtel Prepaid: ఎయిర్‌టెల్ యూజర్లకు ఐపీఎల్ స్పెషల్ ప్యాక్

ఐపీఎల్ లవర్స్‌కు భారతీ ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్19న పున: ప్రారంభంకానున్న నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్లను..

10TV Telugu News

Airtel Prepaid: ఐపీఎల్ లవర్స్‌కు భారతీ ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్19న పున: ప్రారంభంకానున్న నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్లను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్‌లను విడుదల చేసింది. దీంతో వినియోగదారులు తమ మొబైల్ ద్వారానే టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

ఈ మూడు కొత్త ప్యాక్ (రూ.499, రూ.699, రూ.2798)లను రీఛార్జ్ చేసుకుంటే హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్
రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ సర్వీస్ కాలింగ్ సర్వీస్ వంటి బెనిఫిట్స్‌ను అందిస్తుంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందొచ్చు.
Bollywood Actress : బికినిలో అదర గొడుతున్న భామలు..
ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్
రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్‌తో 56 రోజుల వాలిడిటీ, రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సర్వీస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందొచ్చు.

ఎయిర్ టెల్ రూ.2798 ప్లాన్
రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్‌తో 365 రోజుల వాలిడిటీ, రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సర్వీస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందొచ్చు.