ఐ ఫోన్ ఛాలెంజ్: మీ ఫొటోలను ఏం చేస్తారో తెలుసా

ఐ ఫోన్ ఛాలెంజ్: మీ ఫొటోలను ఏం చేస్తారో తెలుసా

ఆపిల్ సంస్థ వినియోగదారులకు ఓ వినూత్నమైన ఛాలెంజ్ విసిరింది. షాట్ ఆన్ ఐఫోన్ అనే పేరుతో మొదలైన ఈ ఛాలెంజ్‌కు చేయవలసిందల్లా ఐఫోన్ నుంచి ఓ ఫొటోను క్లిక్ మనిపించి ఐఫోన్ యాజమాన్యానికి పంపాలి. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులంతా పాల్గొనాలని ఐ ఫోన్ యాజమాన్యం కోరింది. యూజర్ల నుంచి వచ్చిన ఫొటోలను జడ్జి ప్యానెల్ ఎంపిక చేసి 10 ఫొటోలను తుది విజేతలుగా ఎంపిక చేస్తారట. 

ఆ 10 ఫొటోలను యాపిల్ న్యూస్ రూమ్, యాపిల్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెళ్లు, యాపిల్.కామ్, యాపిల్ రిటైర్ స్టోర్లు, యాపిల్ వుయ్ చాట్, యాపిల్ ట్విట్టర్ అకౌంట్స్, యాపిల్ వీబో అకౌంట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిల్ బోర్డ్స్‌లకు పంపుతారట. 

ఎప్పుడు పంపాలి:

పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు తమ దగ్గర ఉన్న బెస్ట్ ఫొటోలను సెలక్ట్ చేసి సోషల్ మీడియా అకౌంట్లలో #ShotOniPhone అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు చేయాలి. చైనాలో ఉన్న ఐ ఫోన్ యూజర్లు మాత్రం వీబో అకౌంట్‌లో అదే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు చేయాలి. జనవరి 22 అర్థరాత్రి 12 గంటల నుంచి ఫిబ్రవరి 7 రాత్రి 11.59నిమిషాల వరకూ పంపొచ్చు. 

దాంతో పాటు ఐ ఫోన్ మోడల్ కూడా ఇమేజ్ క్యాప్షన్‌లో ఉంచాలి. పోటీకి పంపే ఫొటోలు తప్పనిసరిగా హై రిసొల్యూషన్‌తో ఉండాలి. ఫొటో పేరును ఈ ఫార్మాట్‌లో టైప్ చేసి పంపాలి. ‘ఫస్ట్ నేమ్_లాస్ట్ నేమ్_ఐఫోన్ మోడల్’తో పంపాలి. 

వర్తించనున్న నియమనిబంధనలు :
1. కచ్చితంగా 18 ఏళ్లకు మించి ఉండాలి.
2. యాపిల్ ఉద్యోగస్థులు, ఉద్యోగస్థులకు దగ్గరి వారు పాల్గొనకూడదు.
3. ఫొటోలను ఎడిట్ చేసి పంపే వీలుంది.

జడ్జిలుగా ఎవరు వ్యవహరిస్తారంటే:

పీటే సౌజా(యూఎస్), ఆస్టిన్ మన్(యూఎస్), అన్నెట్ దె గ్రాఫ్(నెదర్లాండ్స్), లూసా డార్(బ్రెజిల్), చెన్ మన్(చైనా), ఫిల్ స్కిల్లర్, కయాన్ డ్రాన్స్, బ్రూక్స్ క్రాఫ్ట్, సెబస్టియన్ మారిన్యూ మెస్, జాన్ మెక్ కార్మాక్, ఆరెమ్ డుప్లెసిస్
గెలుపొందని వారు ప్రత్యేకమైన ఆఫర్లు సంవత్సరం పాటు ఉచితంగా అనుభవించవచ్చు.