Skoda Slavia: కొత్త “స్లావియా” కారును భారత్ లో విడుదల చేసిన స్కోడా: మోడల్ వారీగా ధరలు

వోక్స్ వ్యాగన్ సబ్సిడీ సంస్థైన స్కోడా మరో కొత్త కారును భారత విఫణిలోకి విడుదల చేసింది. స్కోడా స్లావియా పేరుతో ఈ కారు మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనట్లు సంస్థ తెలిపింది

Skoda Slavia: కొత్త “స్లావియా” కారును భారత్ లో విడుదల చేసిన స్కోడా: మోడల్ వారీగా ధరలు

Skoda

Skoda Slavia: జర్మనీకి చెందిన దిగ్గజ కారు తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ తమ సబ్సిడీ సంస్థైన స్కోడా నుంచి మరో కొత్త కారును భారత విఫణిలోకి విడుదల చేసింది. స్కోడా స్లావియా పేరుతో ఈ కారు మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనట్లు సంస్థ తెలిపింది. సెడాన్ మోడల్ గా వస్తున్న ఈ కారు.. హోండా సిటీ, హ్యుండయ్ వెర్నా, సుజుకి సియాజ్ వంటి కార్లకు గట్టిపోటీ ఇస్తుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే “కుషాక్” ఎస్యూవీ అమ్మకాలతో జోరుమీదున్న స్కోడా.. ఇప్పుడు సెడాన్ సెగ్మెంట్ లోనూ దృష్టిపెట్టింది. ఇండియాలో రూ.10.69 లక్షల ప్రారంభ ధరగా వస్తున్న ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Also read: Joy E-Bike: ఈ బైక్‌లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి అయ్యే ఖర్చు 115 రూపాయలే! ధర ఎంతంటే?

Skoda “Slavia” specifications:
స్లావియా ఇంజిన్ విషయానికి వస్తే..ఇండియాలో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో ఈ స్లావియా లభిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. వీటిలో మొదటగా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికొస్తే.. 3-సిలిండర్ TSI ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ సిస్టంతో వస్తుంది. 114bhp మరియు 175Nm టార్క్ కలిగి ఉంది ఈ ఇంజిన్. ఇక 1.5 లీటర్ టర్బో పెట్రోల్ విషయానికొస్తే.. 4 – సిలిండర్ TSI ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్ సిస్టంతో వస్తుంది. ఈ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Also read: Sunroof Cars: తక్కువ కాస్ట్‌లో సన్‌రూఫ్‌ కార్లు.. మోడళ్లు, ధరలు ఇవే!

ఈ స్లావియా కారు లోపలి భాగంలో Apple CarPlay, Android Auto మరియు MirrorLink కనెక్టివిటీతో కూడిన 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, మరియు వెనుక AC వెంట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కారు బయట ఫీచర్స్ ను పరిశీలిస్తే ముందు భాగాన బ్లాక్- క్రోమ్ సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, L-ఆకారపు LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ లైట్లు, నలుపు పూత పూసిన B, C-పిల్లర్లు, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక LED టెయిల్ లైట్లు, క్రోమ్ స్ట్రిప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇక వేరియంట్ల వారీగా స్కోడా స్లావియా (ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
స్లావియా 1.0 TSI యాక్టివ్ MT: రూ. 10.69 లక్షలు

స్లావియా 1.0 TSI యాంబిషన్ MT: రూ. 12.39 లక్షలు

స్లావియా 1.0 TSI యాంబిషన్ AT: రూ. 13.59 లక్షలు

స్లావియా 1.0 TSI స్టైల్ MT (నాన్-సన్‌రూఫ్): రూ 13.59 లక్షలు

స్లావియా 1.0 TSI స్టైల్ MT: రూ. 13.99 లక్షలు

స్లావియా 1.0 TSI స్టైల్ AT: రూ. 15.39 లక్షలు.

గత నెలలోనే స్కోడా సంస్థ ఈ స్లావియా కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టినా.. అమ్మకాలు మాత్రం సోమవారం నుంచి ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది.

Also read: Whatsapp Join Group : జూమ్ తరహాలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది..!