రూల్స్ బ్రేక్ చేసినా.. ప్లే స్టోర్‌లో కొన్ని లోన్ యాప్స్‌ను గూగుల్ అనుమతిస్తోంది!

Some lending apps on India’s Google Play : భారత యాప్ మార్కెట్లో అనేక లెండింగ్ యాప్‌లను మిలియన్ల మంది యూజర్లు మిలియన్ల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో కనీసం 10 భారతీయ లెండింగ్ యాప్స్ గూగుల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్లే స్టోర్‌లో గూగుల్ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ ఆయా లెండింగ్ యాప్స్ తమ సేవలను కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఇలాంటి లెండింగ్ యాప్స్ ను నాలుగింటిని ఇప్పటికే గూగుల్ తమ ప్లేస్టోర్ నుంచి తొలగించింది కూడా. భారతీయ యూజర్లు పెద్ద సంఖ్యలో లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. 60 రోజులలోపు లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలో ఫుల్ పేమెంట్ చేసే పర్సనల్ లోన్లపై నిషేధాన్ని ఈ యాప్స్ ఉల్లంఘించాయని నివేదిక పేర్కొంది. ఇందులో మూడు లెండింగ్ యాప్స్ అయిన 10MinuteLoan, Ex-Money, Extra Mudra సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేదు.
నాల్గో యాప్ StuCred కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ మళ్లీ తిరిగి జనవరి 7న గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించింది గూగుల్. ఈ యాప్ 30 రోజుల లోన్ ఆఫర్‌ను తొలగించిన తరువాతే గూగుల్ ప్లే స్టోర్ లోకి అనుమతినిచ్చింది. మిగిలిన 6 యాప్స్ నుంచి 15 మంది రుణగ్రహీతలు తమ రుణ వివరాల స్క్రీన్‌షాట్‌లను బయటపెట్టారు. అందులో కనీసం 6 ఇతర యాప్‌లు రుణ తిరిగి చెల్లించే గడువు ఏడు రోజుల కన్నా తక్కువ అందుబాటులో ఉన్నాయి.
ఈ యాప్‌ల్లో కొన్ని లెండింగ్ యాప్స్.. 30 రోజుల లేదా అంతకన్నా తక్కువ వ్యవధి రుణాల్లో రూ.10,000 కన్నా తక్కువ రుణాలపై రూ.2,000 ($ 27) అధిక ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నాయి. వన్-ఆఫ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు రుణగ్రహీతలు వారానికి 60శాతం వడ్డీ రేట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెండింగ్ యాప్స్ తో పోలిస్తే.. భారతీయ బ్యాంకులు సాధారణంగా 10-20శాతం వార్షిక వడ్డీ రేటుతో పర్సనల్ లోన్లు అందిస్తాయి.
సాధారణంగా కనీసం ఒక ఏడాదికి పూర్తిగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. డిసెంబరులో లెండింగ్ యాప్‌ల గురించి ఆర్బీఐ పబ్లిక్ నోటీసును జారీ చేసింది. అధిక వడ్డీ రేట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ హెచ్చరించింది.