Sony Wireless Speaker : 25 గంటల బ్యాటరీ లైఫ్‌తో సోనీ కొత్త వైర్లెస్ స్పీకర్ వచ్చేసిందోచ్.. స్పెషల్ ఆఫర్ మీకోసం.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Sony Wireless Speaker : ఆన్లైన్ మార్కెట్లో కొత్త వైర్లెస్ స్పీకర్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony India) ఇండియా నుంచి సరికొత్త వైర్లెస్ స్పీకర్ (Sony New Wireless Speaker) మార్కెట్లోకి వచ్చేసింది.

Sony Wireless Speaker : ఆన్లైన్ మార్కెట్లో కొత్త వైర్లెస్ స్పీకర్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony India) ఇండియా నుంచి సరికొత్త వైర్లెస్ స్పీకర్ (Sony New Wireless Speaker) మార్కెట్లోకి వచ్చేసింది. ఈ స్పీకర్ ప్రత్యేకమైన ధరకు అందుబాటులో ఉంది. లౌడ్, వైర్లెస్ స్పీకర్, క్లియర్ సౌండ్ ఎంజాయ్ చేయవచ్చు. ఏదైనా పార్టీ వేడుకల్లో ఔత్సాహిక వినియోగదారులు వైర్లెస్ స్పీకర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వినియోగదారుల కోసం సోనీ ఇండియా తమ కొత్త వైర్లెస్ స్పీకర్‌ను X-సిరీస్ రేంజ్లో SRS-XV900ని రిలీజ్ చేసింది.
సోనీ SRS-XV900 స్పీకర్ :
ప్రపంచంలోని సంగీత ప్రియులకు బెస్ట్ సౌండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అందించడానికి స్పీకర్ ‘Live Life Loud’ విజన్‌లో భాగంగా ఈ కొత్త వైర్లెస్ స్పీకర్ రూపొందించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. Sony కొత్త SRS-XV900 స్పీకర్ నుంచి క్లియర్ సౌండ్ ఆస్వాదించవచ్చునని సోనీ ఇండియా పేర్కొంది. సరికొత్త ప్రొడక్టు ఫీచర్లను వివరిస్తూ.. సోనీ స్పీకర్లు ‘స్పేస్‌ని సౌండ్‌తో నింపేలా రూపొందించినట్టు తెలిపింది. వినియోగదారులు ఓమ్నిడైరెక్షనల్ పార్టీ సౌండ్‌ను ఆస్వాదించవచ్చని తెలిపింది. స్పీకర్లు ‘డీప్, పంచ్, పవర్ ఫుల్ బాస్ కూడా అందజేస్తాయని టెక్ దిగ్గజం పేర్కొంది.
టీవీ సౌండ్ బూస్టర్‌కి ‘Hello’ చెప్పండి :
సోనీ స్పీకర్లలో మరో ప్రత్యేక ఫీచర్ టీవీ సౌండ్ బూస్టర్ (TV Sound Booster) ఒకటి. టీవీ చూస్తున్నప్పుడు అద్భుతమైన సౌండ్ ఆస్వాదించడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. SRS-XV900 నుంచి డీప్ బాస్, రియలిస్టిక్ హై-ఫ్రీక్వెన్సీ సౌండ్ అందిస్తుంది. మీరు లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియోలు లేదా సినిమాలను చూస్తున్నా, రిచ్ ఆడియో-విజువల్ అనుభవాన్ని అందిస్తుందని సోనీ తెలిపింది.

With battery life of up to 25 hours, Sony’s new wireless speaker is available
టీవీ సౌండ్ బూస్టర్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి? :
టీవీ సౌండ్ బూస్టర్ ఫీచర్‌ని ఉపయోగించడానికి.. మీరు ఆప్టికల్ కేబుల్‌ని ఉపయోగించడం ద్వారా టీవీని స్పీకర్లతో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. టీవీ సౌండ్ బూస్టర్ ఫంక్షన్‌ను ఎంచుకోవాలి.
బ్యాటరీ లైఫ్, ఫీచర్లు, ధర ఎంతంటే? :
సోనీ వైర్లెస్ స్పీకర్లు 25 గంటల వరకు ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్‌తో వస్తాయని సోనీ పేర్కొంది. ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా నాన్‌స్టాప్‌గా పార్టీ చేసుకోవచ్చు. అయినప్పటికీ, స్పీకర్ బ్యాటరీ అయిపోతే.. స్పీకర్లు వెంటనే ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 3 గంటల ప్లే టైమ్ వస్తుంది.
సోనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఇతర ఫీచర్లలో మెగా బాస్ (Mega Boss) మెరుగైన సంగీత అనుభవం కోసం లైవ్ సౌండ్ (Live Sound), సౌకర్యవంతమైన క్యారీ హ్యాండిల్, వీల్స్, కరోకే డబుల్ ట్రాకింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైనవి ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. సోనీ SRS-XV900 స్పీకర్ ప్రత్యేక ధర రూ. 69,990గా ఉంది. ఇందులో రూ. 5వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రిపబ్లిక్ డే ఆఫర్ సమయంలో జనవరి 26 వరకు అందుబాటులో ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..