South Korea : టెక్ దిగ్గజానికి భారీ షాక్, రూ. 176 మిలియన్ డాలర్ల జరిమానా..ఎందుకు ?

ఫోన్లలో ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించకుండా..గూగుల్ (Google) అడ్డుకొంటోందని లోకల్ స్మార్ట్ ఫోన్ మేకర్ల నుంచి ఆరోపణలు వచ్చాయి.

South Korea : టెక్ దిగ్గజానికి భారీ షాక్, రూ. 176 మిలియన్ డాలర్ల జరిమానా..ఎందుకు ?

Google

Google : గూగుల్..సోషల్ మీడియాలో ప్రధాన సెర్చ్ ఇంజిన్. ఏ సమాచారం కావాలన్ని ఇది ఇస్తుంది. క్షణాల్లో కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం చేస్తుంది. అలాంటి ఈ టెక్ దిగ్గజానికి వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే దక్షిణ కొరియా ప్రత్యేక చట్టం ద్వారా..గూగుల్ – యాపిల్ ప్లే స్టోర్స్ కు మార్కెటింగ్ కు భారీ దెబ్బ కొట్టిన విషయం ఇంకా మరిచిపోకముందే…భారీ జరిమాన విధించింది. ఏకంగా 207 బిలియన్ వన్ ల (రూ. 176 మిలియన్ డాలర్ల) భారీ జరిమాన విధించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంత భారీ జరిమాన ఎందుకు విధించాల్సి వచ్చింది ? గూగుల్ చేసిన తప్పేంటీ ? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

Read More : Google Dark Theme: గూగుల్ సెర్చ్ పేజ్‌లో డార్క్ థీమ్.. ఆన్ చేసుకోండిలా

అసలేం జరిగింది ?

ఫోన్లలో ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించకుండా..గూగుల్ (Google) అడ్డుకొంటోందని లోకల్ స్మార్ట్ ఫోన్ మేకర్ల నుంచి ఆరోపణలు వచ్చాయి. దీనిని తేల్చేందుకు కేఎఫ్ టీసీ (KFTC) రంగంలోకి దిగింది. దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో అల్ఫాబెట్ కంపెనీకి చెందిన గూగుల్ కు దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ. 176 మిలియన్ డాలర్ల భారీ జరిమాన విధించింది. ఇందుకు గల కారణాలు కూడా తెలిపింది.

Read More : Google : గూగుల్ అసిస్టెంట్ కోసం.. ఓకే గూగుల్ కు బై చెప్పేసి ప్రొసీడ్ అయిపోండిలా

మొబైల్ మార్కెటింగ్ సిస్టమ్ మార్కెట్ పోటీలో నైతిక విలువలను గూగుల్ విస్మరించిందని, అధిపత్య పోరులో కంపెనీలను నిలువరించడం ద్వారా…పోటీతత్వానికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ…కొరియా ఫెయిర్ ట్రేడ్…కమిషన్ (KFTC) చెబుతోంది. కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి వీల్లేకుండా…వెంటనే ఈ జరిమానాను కట్టాలంటూ..గూగుల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు… గూగుల్ న్యూస్ లో కాపీ రైట్ వివాదం తెరమీదకు వచ్చింది. ఫ్రాన్స్ రెగ్యులేటరీ అథార్టీ భారీ జరిమాన విధించింది. అయితే..తాము చెల్లించే ప్రసక్తే లేదంటూ..కౌంటర్ దాఖలు చేసింది. మరి భారీ జరిమాన విషయంలో టెక్ దిగ్గజం గూగుల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.