Google, Apple: యాపిల్‌, గూగుల్‌కు షాక్.. ప్రత్యేక చట్టంతో ఆధిపత్యానికి చెక్‌!

దక్షిణ కొరియాలోని పార్లమెంటరీ కమిటీ యాప్ డెవలపర్లైన.. గూగుల్, యాపిల్ సంస్థలకు షాక్ ఇచ్చింది.

Google, Apple: యాపిల్‌, గూగుల్‌కు షాక్.. ప్రత్యేక చట్టంతో ఆధిపత్యానికి చెక్‌!

Google

Google, Apple: దక్షిణ కొరియాలోని పార్లమెంటరీ కమిటీ ఒక బిల్లును ఆమోదించింది. దీని కింద, యాప్ డెవలపర్లైన.. గూగుల్, యాపిల్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లని ఉపయోగించినందుకు బలవంతంగా ఛార్జ్ చేయాలనే నిర్ణాయానికి చెక్ పెట్టింది. నేషనల్ లెజిస్లేచర్ మరియు జ్యుడీషియల్ కమిటీ టెలికాం ఈమేరకు ట్రేడ్ చట్టానికి సవరణలను తీసుకుని వచ్చింది. ఈ బిల్లు ద్వారా, యాప్ డెవలపర్‌ల నుంచి యాప్ మార్కెట్ నిర్వాహకులు అనవసరమైన డబ్బును సేకరించే మార్గాలు క్లోజ్ అయినట్లే.

ఈ గ్లోబల్ టెక్ దిగ్గజాలను యాప్-సంబంధిత బిల్లింగ్ పాలసీలలో ఏకపక్షంగా నిరోధించిన మొదటి దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు గూగుల్ మరియు ఆపిల్ ఈ యాప్ బిల్లింగ్ విధానాలతో గరిష్ఠ స్థాయిలోనో.. కనష్ఠ స్థాయిలోనో ఇబ్బందులు పడుతున్నాయి. వాటిని తమ దేశాలలో నిరోధించడానికి మార్గాలను కనుగొనడానికి అన్వేషిస్తున్నారు నిర్వాహకులు.

అయితే, లేటెస్ట్‌గా సౌత్ కొరియా తీసెుకున్న నిర్ణయంతో యూజర్‌ తమకు నచ్చిన యాప్‌ స్టోర్‌ను ఎంచుకునే అవకాశం దక్కింది. తద్వారా బడా కంపెనీలకు కమిషన్ల రూపంలో వెళ్లే బిలియన్ల ఆదాయానికి చెక్ పెట్టినట్లుగా అయ్యింది. యాప్‌ మార్కెట్‌ప్లేసులలో టాప్‌ టూ పొజిషన్‌లలో కొనసాగుతున్న యాపిల్‌, గూగుల్‌ కంపెనీలు మొబైల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో యాప్‌ కొనుగోళ్ల కోసం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ కమిషన్స్‌ పేరిట బలవంతపు వసూళ్లు చెయ్యడం ఇక కుదరదు.

ప్రపంచంలో ఈ తరహా చట్టం చేసిన దేశం సౌత్ కొరియానే కాగా.. టెలికమ్యూనికేషన్స్‌ బిజినెస్‌ యాక్ట్‌ ప్రకారం.. పోయిన బుధవారమే ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగాల్సి ఉండగా.. ఆలస్యంగా నిన్న(సోమవారం-ఆగష్టు30) ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ హడావిడి నిర్ణయం యాప్‌ డెవలపర్స్‌పైనా, కొరియన్‌ కన్జూమర్స్‌పైనా ప్రభావం చూపించనుందని గూగుల్‌ పబ్లిక్‌ పాలసీ సీనియర్‌ డైరెక్టర్‌ విల్సన్‌ వైట్‌ చెబుతున్నారు. ఇది ఫోన్‌ యూజర్‌ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారమని, ఇంతకాలం అది భద్రతతో కూడిన ఓ వ్యవస్థతో నడుస్తూ వచ్చిన పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని అంటున్నారు.