Starlinks Internet ఇకపై అన్ని ఖండాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్.. ఎక్కడైనా అందుబాటులోకి ఇంటర్నెట్

ఎలన్ మస్క్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ మరో ఘనత సాధించింది. తాజాగా ఏడు ఖండాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. కేబుళ్లు, మొబైల్ టవర్లతో పని లేకుండానే యూజర్లు ఈ టెక్నాలజీతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.

Starlinks Internet ఇకపై అన్ని ఖండాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్.. ఎక్కడైనా అందుబాటులోకి ఇంటర్నెట్

Starlinks Internet: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క సంస్థ ‘స్పేస్ ఎక్స్’ అభివృద్ధి చేసిన ‘స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్’ గురించి తెలిసిందే. ప్రత్యేక శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే సర్వీస్ ఇది. ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్ని ఖండాల్లో అందుబాటులోకి వచ్చినట్లు అమెరికాకు చెందిన ‘ద నేషనల్ సైన్స్ ఫౌండేషన్’ సంస్థ ప్రకటించింది.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

చివరకు అంటార్కిటికా ఖండంలో కూడా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. మొబైల్ సిగ్నల్ లేదా కేబుల్‌తో పని లేకుండానే దీని ద్వారా యూజర్లు ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ఎప్పట్నుంచో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. తాజాగా దీనికి సంబంధించిన బ్యాండ్‍‌విడ్త్‌ను పెంచడం ద్వారా అన్ని ఖండాల్లోకి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అయితే, ఈ సేవల్ని అంత ఈజీగా వినియోగించుకోలేం. స్టార్‌లింక్ డెవలప్ చేసిన ఈ టెక్నాలజీతో హైలీ అడ్వాన్స్‌డ్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందుతుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ పొందాలంటే ఆ సంస్థ తయారు చేసిన ప్రత్యేక కిట్ ఉండాలి.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

ఇందులో ఒక స్టార్‌లింక్ డివైజ్, వైఫై రౌటర్, కేబుల్స్, బేస్ వంటివి ఉంటాయి. ఈ కిట్ ఉంటే భూమిపై ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. వచ్చే ఏడాది టీ-మొబైల్ అనే సంస్థతో కలిసి, స్సేస్ ఎక్స్ అనే సంస్థ స్టార్‌లింక్ శాటిలైట్లను అందుబాటులోకి తేనుంది. వీటి ద్వారా మొబైల్ ఫోన్లో 5జీ సేవలు పొందవచ్చు. ఈ టెక్నాలజీ మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ, కేబుళ్లు లేని ప్రాంతాలకు బాగా ఉపయోగడపడుతుంది.