భారత డిజిటల్ రంగంలో చైనా కంపెనీల ఆధిపత్యం ఎంతలా ఉందంటే? 

  • Published By: sreehari ,Published On : July 6, 2020 / 03:07 PM IST
భారత డిజిటల్ రంగంలో చైనా కంపెనీల ఆధిపత్యం ఎంతలా ఉందంటే? 

డ్రాగన్ ఆధిపత్యం ఒక భారత్ పైనే కాదు.. చాలా ప్రపంచ దేశాలపైనే ఉంది. ప్రత్యేకించి భారత డిజిటల్ రంగంపై కూడా చైనా కంపెనీలు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. టెక్నాలజీ మార్కెట్లోనూ చైనా ప్రభంజనం అంతాఇంతా కాదు.. మార్కెట్లో సగానికి పైగా చైనా కంపెనీలు తయారు చేసినవే చెలామణీ అవుతున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దుల్లో చైనాకు, భారత్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటినుంచి డ్రాగన్ తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవలే చైనాతో సరిహద్దుల మధ్య ఘర్షణతో డ్రాగన్ కుతుంత్ర బయటపడింది. చైనాను దెబ్బకు దెబ్బ తీయాలని భావించిన వెంటనే భారతదేశంలో 59 చైనీస్ యాప్స్ నిషేధం విధిస్తూ కేంద్రం ప్రకటించింది. చైనా యాప్ ల్లో అత్యంత పాపులర్ అయిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ వాడే వినియోగదారులు భారతదేశంలో మిలియన్ల మంది ఉన్నారు. భారతదేశంలో 120 మిలియన్లకు పైగా టిక్ టాక్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

చైనాపై ప్రభుత్వం తీసుకున్న చర్యకు ఇదే ప్రధానమని చెప్పవచ్చు. ఇతర యాప్‌లు సైతం భారతదేశంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. టెక్నాలజీ మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం.. భారతదేశంలో ప్రతి ముగ్గురు స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఒకరు తమ డివైజ్‌లో చైనీస్ యాప్‌ల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నారని వెల్లడించింది. భారతీయ ఇంటర్నెట్ యూజర్లకు తగినట్టుగా ఈ యాప్స్ భారతదేశంలో చైనా డిజిటల్ ఉనికినితో వందలాది ఉన్నాయి. 2018 నుంచి దేశంలోని భారీగా డౌన్‌లోడ్‌లతో దూసుకెళ్తూ అమెరికన్ యాప్ పోటీదారులను సైతం పక్కకు నెట్టేశాయి. 2018లో, భారతదేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన 100 ఇంటర్నెట్ యాప్‌ల్లో 44 చైనా కంపెనీలు తయాుచేసినవే ఉన్నాయి. 2017లో ఇలాంటి 18 యాప్‌లే అత్యంత ఆదరణ పొందాయని Observer Research Foundation రిపోర్టు తెలిపింది. గత ఏడాది టిక్‌టాక్ ఫేస్‌బుక్‌ను అధిగమించి భారతదేశంలో 611 మిలియన్ డౌన్‌లోడ్‌లకు చేరుకుందని మార్కెట్ విశ్లేషణ సంస్థ Sensor Tower తెలిపింది.

వ్యూహాత్మక లక్ష్యంగా టెక్నాలజీ :
హార్డ్ వేర్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు, చైనా సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీ స్థలంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సొంత దేశమైన చైనాలో కంటే ఎక్కువగా ప్రాబల్యం ఉన్నాయని చెప్పవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఇలా డిజిటల్ విస్తరించే ప్రయత్నంలో భాంగా 65 దేశాలకు డ్రాగన్ అడుగుపడింది. 2015 ఇంటర్నెట్ ప్లస్ స్ట్రాటజీ, 2006-2020 నాటి నేషనల్ ఇన్ఫర్మేటైజేషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ వంటి ఇతర వ్యూహాలు దేశంలోని అతిపెద్ద కంపెనీలైన Baidu, Alibaba and Tencent వంటి ప్రొడక్టులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఆధిపత్య దిశగా దూసుకెళ్లాయి. అలా వచ్చిన చైనీస్ కంపెనీల్లో Xiaomi బ్రాండ్లు Oppo, Vivo, OnePlus, Realme మరెన్నో పాపులర్ బ్రాండ్లు ఉన్నాయి. 2016లో భారతీయ అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో తన చౌకైనా డేటాతో అడుగుపెట్టింది. టెలికాం రంగానికి విఘాతం కలిగించే ఉచిత ఇంటర్నెట్ ప్యాకేజీతో అడుగుపెట్టడంతో ఈ చైనా కంపెనీలు మరింత లోతుగా దూసుకెళ్లాయి.

దేశంలో మొదటి 5 స్మార్ట్ ఫోన్ మేకర్లలో చైనానే అగ్రస్థానం :
అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ లేటెస్ట్ డేటా ప్రకారం.. దేశంలో మొదటి 5 స్మార్ట్‌ఫోన్ అమ్మకందారులలో, 4 చైనీయులు, షియోమి 31.2శాతం మార్కెట్ వాటాతో చార్టులలో అగ్రస్థానంలో ఉన్నారు. వివో 21శాతం వద్ద ఉంది. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో డజన్ల కొద్దీ చైనా కంపెనీలు కాంట్రాక్ట్ మేకర్స్ అంతా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఇతర ప్రాంతాలలో కంపెనీ బేస్ ఏర్పాటు చేసుకున్నాయి. మైక్రోమాక్స్ వంటి భారతీయ బ్రాండ్లు కూడా మొదట్లో చైనా నుంచి సెమీ-నాక్-డౌన్ మొబైల్ ఫోన్ యూనిట్లను దిగుమతి చేసుకున్నాయి. ఈ పరికరాలను స్థానికంగా అసెంబుల్ చేసుకుని చైనాకు పోటీగా తక్కువ ధరకు విక్రయించడానికి ప్రయత్నించాయి కూడా. ఈ కంపెనీ గురుగ్రామ్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు ఇదే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.

శామ్‌సంగ్, నోకియా వంటి గ్లోబల్ బెహెమోత్‌లను సైతం అధిగమించింది. గత ఏడాదిలోనే ByteDance మూడేళ్ల కాలంలో భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. చైనా పరికరాల అమ్మకందారులైన హువావే, ZTE కూడా భారతదేశంలో టెలికాం పరికరాల్లో గణనీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ టెలికాం కంపెనీలు ఈ చైనా పరికరాల తయారీదారుల సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడ్డాయి. రోపియన్ దిగ్గజాలైన ఎరిక్సన్ మరియు నోకియా వంటి భాగస్వామ్యాలు ఈ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి. 2017 డోక్లాం సంఘటన అప్పుడు కూడా 42 చైనా యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాల సిబ్బందిని కోరింది.

Read Here>>వరుసగా నాల్గవ రోజు 20వేలకు పైగా కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవే!