Tata Motors : టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం.. ఆ వాహనాల ధరలు పెంచేసింది.. ఎంతంటే?

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను భారీగా పెంచేసింది.

Tata Motors : టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం.. ఆ వాహనాల ధరలు పెంచేసింది.. ఎంతంటే?

Tata Motors Hikes Passenger Vehicle Prices To Offset Rising Input Costs (1)

Tata Motors : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను భారీగా పెంచేసింది. పెంచిన కొత్త ధరలు శనివారం (జూలై 9) నుంచే అమల్లోకి వచ్చాయని టాటా మోటార్స్ వెల్లడించింది. దాంతో టాటా మోటార్స్‌ ప్యాసింజర్ కార్ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల భారాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచినట్లు పేర్కొంది. వేరియంట్, మోడల్ ఆధారంగా గతంలోని ధరలో సగటున 0.55 శాతం పెంచినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులతో కంపెనీ ఈ దిశగా చర్యలు తీసుకుందని పేర్కొంది. దేశీయ విపణిలో కంపెనీ పంచ్, నెక్సాన్, హారియర్, సఫారితో సహా పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. నివేదిక ప్రకారం.. టాటా మోటార్స్ ఇప్పటికే తన వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను ఈ నెల నుంచి 1.5 – 2.5% వరకు పెంచింది.

ఇదిలా ఉంటే.. లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో సహా ఆటోమొబైల్ మేజర్ గ్లోబల్ హోల్‌సేల్స్, జూన్ 2022 (Q1FY23) కాలంలో ముగిసిన త్రైమాసికంలో 48శాతం మేర పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. 3,16,443 వాహనాలకు చేరుకుంది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. FY23 మొదటి త్రైమాసికంలో అన్ని టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల గ్లోబల్ హోల్‌సేల్స్, టాటా దేవూ శ్రేణి FY22 Q1 కన్నా 97శాతం పెరిగి 1,03,529 యూనిట్ల వద్ద చేరుకున్నాయి.

Tata Motors Hikes Passenger Vehicle Prices To Offset Rising Input Costs

Tata Motors Hikes Passenger Vehicle Prices To Offset Rising Input Costs

Q1FY23లో అన్ని ప్యాసింజర్ వాహనాల గ్లోబల్ హోల్‌సేల్ Q1 FY22తో పోలిస్తే.. 32శాతం పెరిగి 2,12,914 యూనిట్లుగా ఉంది. త్రైమాసికంలో.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్లోబల్ హోల్‌సేల్స్ 82,587 వాహనాల వద్ద ఉన్నాయి మోడల్ వారీగా.. ఈ త్రైమాసికంలో జాగ్వార్ హోల్‌సేల్స్ 14,596 వాహనాలు ఉండగా.. త్రైమాసికానికి ల్యాండ్ రోవర్ హోల్‌సేల్స్ 67,991 వాహనాలుగా ఉన్నాయి. ముడి సరకుల ధరలు పెరగడంతో ఆటో మొబైల్ కంపెనీలు సైతం గత మూడు నెలలుగా వాహనాల ధరలను పెంచాయి. టాటా మోటార్స్ కూడా తమ ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల ప్రారంభంలో, టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలను మినహాయించి జూన్ నెలవారీ Q1FY23 విక్రయాల డేటాను ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 1,07,786 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. క్యూ1FY23లో మొత్తం దేశీయ అమ్మకాలు 110శాతం పెరిగి 2,25,828 యూనిట్లు పెరిగాయని జూలై 1న టాటా మోటార్స్ డేటా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. మొత్తం దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాలు Q1FY23లో 102శాతం పెరిగి 1,30,125 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 64,386 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తంమీద, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ విక్రయాలు 2,31,248 వాహనాలుగా ఉన్నాయి.

Read Also : Tata Motors: దూసుకెళ్లిన టాటా మోటార్స్ షేర్, దశాబ్దాల విలువను దాటేస్తూ..