Tech Tips : వాట్సాప్‌లో మీ ఫ్రెండ్ డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా చదవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
Tech Tips : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. రెండు బిలియన్లకుపైగా యాక్టివ్ నెలవారీ యూజర్లతో వాట్సాప్ అనేక మంది iOS, Android ఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తోంది.

Tech Tips : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. రెండు బిలియన్లకుపైగా యాక్టివ్ నెలవారీ యూజర్లతో వాట్సాప్ అనేక మంది iOS, Android ఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తోంది. సాధారణంగా వాట్సాప్ యూజర్ల ప్రైవసీపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ నుంచి బ్లాక్, రిపోర్ట్ ఆప్షన్ వరకు వాట్సాప్ యూజర్లు తమ చాట్‌లను ప్రైవేట్‌గా ఉంచవచ్చు. స్పామ్ కాంటాక్టులను బ్లాక్ చేసేందుకు అనుమతిస్తుంది. యూజర్ ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని WhatsApp రిలీజ్ చేసిన ఫీచర్లలో ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ ఒకటి..
వాట్సాప్ యూజర్లు పంపిన మెసేజ్‌ని 2 రోజుల 12 గంటలలోపు డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యూజర్లు ప్రమాదవశాత్తూ పంపిన చాట్‌ను గంటల తర్వాత కూడా డిలీట్ చేయడానికి అనుమతిస్తుంది. యూజర్లు మెసేజ్‌ని ఎంచుకుని.. డిలీట్ ఫర్ మి లేదా డిలీట్ ఫర్ ఎవర్రీవన్ ఎంచుకోవడం ద్వారా పంపిన మెసేజ్ తొలగించవచ్చు. చాట్ బాక్స్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ డిలీట్ అయితే.. మెసేజ్ డిలీట్ అయిన విషయం అవతలి యూజర్‌కు తెలుస్తుంది. WhatsApp చాట్‌లో మెసేజ్ డిలీట్ అయినట్టుగా లేబుల్ కనిపిస్తుంది. అప్పుడు మెసేజ్ పొందిన యూజర్ అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
ఈ మెసేజ్ డిలీట్ చేశారు అనే ట్యాగ్‌ని చూడటం కొన్నిసార్లు యూజర్లకు చికాకుగా కూడా ఉంటుంది. Meta కంపెనీ Instagram యూజర్ల కోసం ఇదే విధమైన డిలీట్ ఆప్షన్ అందిస్తుంది, కానీ, అక్కడ రిసీవర్‌కు డిలీట్ చేసిన మెసేజ్ గురించి తెలియదు. అలాంటప్పుడు, డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌ని ఎలా చదవాలి? WhatsApp ద్వారా డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి పొందాలంటే ప్రత్యేక ఫీచర్ ఏదీ లేదు. యూజర్ల ప్రైవసీని పరిశీలిస్తే.. ప్లాట్‌ఫారమ్ సమీప భవిష్యత్తులో కూడా అలాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టే ఆలోచన లేదనే చెప్పాలి. ఒకవేళ మీరు డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను చదవలేమా? అంటే ఈజీగా చదవవచ్చు. అందుకు కొన్ని ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

Tech Tips _ How to read WhatsApp messages deleted by your friend
థర్డ్ పార్టీ యాప్‌లతో డిలీటెడ్ వాట్సాప్ మెసేజ్‌లను రీడ్ చేయొచ్చు :
మీరు యాప్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోగలిగే అనేక థర్డ్-పార్టీ డేటా రికవరీ యాప్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను తిరిగి పొందవచ్చునని యాప్ పేర్కొంది. అయినప్పటికీ, ఈ టూల్స్ ఉపయోగించడం వల్ల డేటా చోరీ, మాల్వేర్, మీ డివైజ్ అనధికారిక యాక్సెస్ వంటి రిస్క్ ఉంటుంది. అదనంగా, అన్ని రికవరీ టూల్స్ ప్రభావవంతంగా ఉండవు. కొన్నిసార్లు పర్మినెంట్ డేటా నష్టానికి దారితీయొచ్చు.
బ్యాకప్ ద్వారా డిలీట్ చేసిన WhatsApp మెసేజ్‌లను చదవచ్చు :
మీ WhatsApp డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయడం ద్వారా మునుపటి బ్యాకప్ నుంచి మెసేజ్‌లను రీస్టోర్ చేయొచ్చు. అందుకు WhatsApp Settings > Chats> Chat Backupకి వెళ్లి డిలీట్ చేసిన మెసేజ్‌లను కలిగిన మునుపటి బ్యాకప్ కోసం ప్రయత్నించవచ్చు. ఇలా కూడా యాప్‌ను డిలీట్ చేసి.. ఆపై మళ్లీ లాగిన్ చేసి బ్యాకప్‌ను రన్ చేయొచ్చు. థర్డ్ పార్టీ ఆప్షన్ సేఫ్ అని చెప్పవచ్చు. Android యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిర్దిష్టంగా చెప్పాలంటే.. Android 11 యూజర్ల మాత్రమే అందుబాటులో ఉంది. నోటిఫికేషన్ హిస్టరీని చెక్ చేయడం ద్వారా Androidలో డిలీట్ చేసిన WhatsAppని మీరు ఎలా చదవవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
Android ఫోన్‌లో డిలీట్ చేసిన WhatsApp మెసేజ్ ఎలా చదవాలంటే? :
* మీ డివైజ్ ‘Settings’కి వెళ్లండి.
* ఇప్పుడు స్క్రోల్ చేసి, ‘Apps & Notifications’పై Tap చేయండి.
* నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
* ఆప్షన్ కింద ‘నోటిఫికేషన్ హిస్టరీ’పై Tap చేయండి.
* ఆ తర్వాత ‘Use Notification History’ పక్కన ఉన్న బటన్‌ను టోగుల్ చేయండి.
నోటిఫికేషన్ హిస్టరీని ఆన్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ మెసేజ్‌ల నోటిఫికేషన్‌లను డిలీట్ చేసినా కూడా చూడవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..