Tech Tips in Telugu : ఆపిల్ ఐఫోన్‌లో చాట్‌జీపీటీ ఎలా వాడాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Tech Tips in Telugu : ఏఐ టెక్నాలజీ (ChatGPT)ని ఉపయోగించి టెక్స్ట్‌ని రూపొందించడం, భాషలను అనువదించడం వంటి అనేక రకాల క్రియేటివిటీ కంటెంట్‌ని ఉపయోగించవచ్చు.

Tech Tips in Telugu : ఆపిల్ ఐఫోన్‌లో చాట్‌జీపీటీ ఎలా వాడాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Tech Tips in Telugu _ How to use ChatGPT on iPhone, Follow these Steps

Tech Tips in Telugu How to use ChatGPT on iPhone : ఏఐ టెక్నాలజీ టూల్ AI చాట్‌బాట్ ఇప్పుడు యాప్ రూపంలో అందుబాటులో ఉంది. (ChatGPT)ని ఉపయోగించడం చాలాసౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఇకపై బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదని అర్థం. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసి చాట్‌జీపీటీ ఉపయోగించవచ్చు. అయితే, ఈ సదుపాయం కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు (ChatGPT) యాప్‌ను యాక్సెస్ చేయడానికి మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.

OpenAI యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన అనేక దేశాలలో భారత్ ఒకటి. చాట్‌బాట్‌ని సులభంగా యాక్సెస్ చేసేందుకు పాజిటివ్ లేదా నెగటివ్‌లు ఉన్నాయి. మీరు ముందుగా యాప్‌ని ఉపయోగించడం నేర్చుకోవాలి. మీకు చాట్‌జీపీటీ గురించి ఇంకా తెలియకపోతే.. ఇప్పుడు తెలుసుకుందాం.. ఏఐ చాట్‌బాట్‌తో టెక్స్ట్‌ని రూపొందించడం, భాషలను అనువదించడం, వివిధ రకాల క్రియేటివిటీ కంటెంట్‌ను రాయడం వంటి మీ ప్రశ్నలకు ఇన్ఫర్మేటివ్‌గా సమాధానాలు ఇస్తుంది. వాస్తవానికి ఈ చాట్‌జీపీటీ కొన్ని కష్టతరమైన ప్రవేశ పరీక్షలను సైతం ఛేదించింది.

Read Also : Amazon Huge Discounts : అమెజాన్‌లో 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!

మీకు ఐఫోన్ ఉంటే.. మీరు వెంటనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి :
* మీ iPhoneలో యాప్ స్టోర్‌కి వెళ్లండి.
* యాప్ స్టోర్‌లో ChatGPTని సెర్చ్ చేయండి.
* ChatGPTలో మల్టీ ఫేక్ యాప్‌లు ఉన్నాయి.
* OpenAI ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
* మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేయమని అడుగుతుంది.
* మీ Gmail ID లేదా Apple IDని ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
* ఆ తర్వాత, మీరు హాయ్ మెసేజ్‌ వెల్‌కమ్ చెబుతుంది.
* చాట్ విండో మెసేజింగ్ యాప్ మాదిరిగా ఉంటుంది.
* మీరు మీ ప్రశ్నలను టైప్ చేయడం కొనసాగించవచ్చు. ఆపై సమాధానాలు పొందవచ్చు.

Tech Tips in Telugu _ How to use ChatGPT on iPhone, Follow these Steps

Tech Tips in Telugu _ How to use ChatGPT on iPhone, Follow these Steps

ముఖ్యంగా, మీరు కొత్త చాట్ కోసం కొత్త విండోను ఓపెన్ చేయొచ్చు. మీరు ఒకే చాట్‌లో విభిన్న చాటింగ్ కొనసాగించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ప్రస్తుతానికి ChatGPT వెబ్ ఆధారిత వెర్షన్ ఉపయోగించవచ్చు. ChatGPT వెబ్ ఆధారిత వెర్షన్ ఉపయోగించడానికి మీ iPhoneలో వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలి. ChatGPT వెబ్‌సైట్‌కి వెళ్లండి.

మీకు ఇప్పటికే అకౌంట్ లేకుంటే అకౌంట్ క్రియేట్ చేయాలి. మీరు అకౌంట్‌ను క్రియేట్ చేసిన తర్వాత ChatGPTతో చాట్ చేయడం ప్రారంభించవచ్చు. ChatGPTతో చాట్ చేసేందుకు స్క్రీన్ దిగువన ఉన్న టెక్స్ట్ ఫీల్డ్‌లో మీ ప్రశ్న లేదా అభ్యర్థనను టైప్ చేయండి. ChatGPT మీకు సమాధానం ఇస్తుంది. మీకు నచ్చినంత కాలం ChatGPTతో చాట్ చేయడం కొనసాగించవచ్చు.

Read Also : BGMI Preload Game : ఆండ్రాయిడ్ గేమర్లకు గుడ్‌న్యూస్.. మే 29 నుంచి BGMI ప్రీలోడ్ గేమ్ ఆడొచ్చు..!