Tecno Phantom V Flip 5G : టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్లు, డిజైన్ ఇదిగో..!
Tecno Phantom V Flip 5G : కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. ముందుగానే ఫోల్డబుల్ డిజైన్ కంపెనీ రివీల్ చేసింది.

Tecno Phantom V Flip 5G India Launch Confirmed, Specifications Tipped
Tecno Phantom V Flip 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? టెక్నో (Tecno) ఫాంటమ్ V ఫ్లిప్ 5G త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని ధృవీకరించింది. ఈ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిజైన్‌ను కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫాంటమ్ ఫోన్ గతంలో (Google Play) కన్సోల్‌లో కొన్ని స్పెసిఫికేషన్లను సూచించింది. మునుపటి నివేదికలు హ్యాండ్సెట్ డిజైన్ రెండర్లను కూడా లీక్ చేశాయి. ఇప్పుడు కొత్త లీక్ రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొన్ని కీలక వివరాలను సూచిస్తుంది.
ముఖ్యంగా, టెక్నో ఈ ఏడాది ప్రారంభంలో ఫాంటమ్ V ఫోల్డ్‌ను లాంచ్ చేసింది. 7.85-అంగుళాల 2K (2000 x 2296) ప్రైమరీ డిస్ప్లేతో వస్తుంది. 4nm MediaTek డైమెన్సిటీ 9000+ SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఫాంటమ్ V ఫ్లిప్ అమెజాన్ మైక్రోసైట్ ఇటీవల రివీల్ చేసింది. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఇ-కామర్స్ సైట్ ద్వారా విక్రయించనుంది. పేజీలో కీలక వివరాలను వెల్లడించనప్పటికీ, పర్పుల్ కలర్ ఆప్షన్లో ఫోల్డబుల్ క్లామ్షెల్ను వెల్లడించింది.
టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా) :
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ (@passionategeekz) పోస్ట్ ద్వారా షేర్ చేశారు. మోడల్ నంబర్ AD11తో ఫాంటమ్ V ఫ్లిప్ మొత్తం ఫిల్మ్ వైట్, మినిమల్ బ్లాక్, పెరివింకిల్ పర్పుల్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందిస్తుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ 2640 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల AMOLED అంతర్గత డిస్ప్లేను, 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.32-అంగుళాల AMOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

Tecno Phantom V Flip 5G India Launch Confirmed, Specifications Tipped
రెండు డిస్ప్లేలు, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC ద్వారా అందిస్తుందని సూచించింది. ఫాంటమ్ V ఫ్లిప్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. Mali-G77 GPU, ఆండ్రాయిడ్ 13తో అందించే అవకాశం కూడా ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఫాంటమ్ V ఫ్లిప్ ఆటోఫోకస్‌తో కూడిన 64MP ప్రైమరీ సెన్సార్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 13MP సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా 32MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 4,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 5G, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ 72.35mm x 74mm x 7.05 mm పరిమాణంలో వస్తుంది. ఫోన్ ఫోల్డ్ చేస్తే.. హ్యాండ్సెట్ 15.1mm మందం కలిగి ఉంటుందని అంచనా.