Telegram: ఫేస్‌బుక్, వాట్సప్ డ్రాప్ అయిన రోజే టెలిగ్రామ్‌కు 7కోట్ల మంది యూజర్లు

ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మూకుమ్మడిగా ఒకేసారి పనిచేయకుండా పోయాయి. కంపెనీ ఫౌండర్, షేర్ హోల్డర్లతో పాటు చాలా వ్యాపారాలకు కూడా నష్టం వచ్చిపడింది.

Telegram: ఫేస్‌బుక్, వాట్సప్ డ్రాప్ అయిన రోజే టెలిగ్రామ్‌కు 7కోట్ల మంది యూజర్లు

Telegram

Telegram: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మూకుమ్మడిగా ఒకేసారి పనిచేయకుండా పోయాయి. కంపెనీ ఫౌండర్, షేర్ హోల్డర్లతో పాటు చాలా వ్యాపారాలకు కూడా నష్టం వచ్చిపడింది. ఇదిలా ఉంటే ఈ చేదు అనుభవం మరొకరికి మాత్రం బాగా కలిసొచ్చింది. మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం టెలిగ్రామ్ కు యూజర్లు వెల్లువలా వచ్చారు.

ఒక్కరోజులోనే దాదాపు 7కోట్ల మంది యూజర్లు వచ్చారని కంపెనీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ మంగళవారం అన్నారు. ‘ఒక్కసారిగా వచ్చి పడిన గ్రోత్ ను హ్యాండిల్ చేయడంలో మా టీం వైఖరి చూసి గర్విస్తున్నాను. మా యూజర్లు పెరుగుతున్న కొద్దీ మా పని పెంచుకుని చక్కని సర్వీస్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నాం’ అని టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.

దీనిని బట్టి అమెరికాలో ఉన్న మిలియన్ల కొద్దీ యూజర్లకు కూడా తక్కువ స్పీడ్ ఫేస్ చేసిన అనుభవం ఎదురైంది. వారంతా టెలిగ్రామ్ కు సైన్ అప్ అయ్యారట. దీంతో రీసెంట్ గా టెలిగ్రామ్ కు 1బిలియన్ డౌన్ లోడ్స్ వచ్చాయి. ఈ సంవత్సరం కంటే ముందు 500 మంది యాక్టివ్ యూజర్లు ఉండే వారు.

……………………………………………..: ఫేస్‌బుక్‌కు మరో షాక్.. ఆదాయంపై భారీ ఎఫెక్ట్??

టెలిగ్రామ్ ఒక్కటే కాకుండా సిగ్నల్ కు కూడా యూజర్లు పెరిగారట. సిగ్నల్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది.