Telegram : ఒకేసారి 1000 మందితో వీడియో కాల్ మాట్లాడొచ్చు

తాజాగా టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ తెచ్చింది. ఈ అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్‌ చేసేలా ఫీచర్‌ ను అప్‌డేట్‌ చేసింది.

Telegram : ఒకేసారి 1000 మందితో వీడియో కాల్ మాట్లాడొచ్చు

Telegram

Telegram : ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.. పదేళ్ల క్రితం ప్రజలకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ.. ఇప్పటి టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. యూజర్లకు దగ్గరయ్యేందుకు వారికి అర్థమైనట్లుగా కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ అందించే కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. తాజాగా టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ తెచ్చింది. ఈ అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో షేరింగ్‌

ఇటీవల వాట్సాప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు యూజర్లకు విసుగు తెప్పిస్తున్నాయి. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. వేరే మేసేంజింగ్ యాప్స్ కోసం చూస్తున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్‌ యాప్‌ను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జులై నెలలో టెలిగ్రామ్ ఇంస్టాలేషన్స్ భారీగా పెరిగాయి. దీంతో టెలిగ్రాం వాట్సాప్‌తో పోటీ పడడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతుంది. తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్‌ చేసేలా ఫీచర్‌ ను అప్‌డేట్‌ చేసింది. ఈ ఫీచర్‌ వల్ల ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్స్‌లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.