భారత్‌కు టెస్లా వస్తోంది.. మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు.. బుకింగ్స్, సేల్స్ ఎప్పుడంటే?

భారత్‌కు టెస్లా వస్తోంది.. మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు.. బుకింగ్స్, సేల్స్ ఎప్పుడంటే?

Tesla’s India entry : ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీల్లో టెస్లా ఒకటి. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లోకి వస్తోంది. కొన్ని నెలల క్రితమే 2021లో టెస్లా బాస్, ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ భారత్ లోకి రానున్నట్టు కంపెనీ ధ్రువీకరించింది. టెస్లా ఇండియా 2021లో బుకింగ్స్, సేల్స్ ప్రారంభం కానున్నాయి. జూన్ నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారుతో ​​ ప్రారంభించే అవకాశం ఉంది.

అది కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే. డెలివరీలు ఎక్కడ, ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మోడల్ 3 ఒక సెడాన్, 0-100 కిలోమీటర్ల సమయం 3.1 సెకన్లలో 500 కిమీ + రేంజ్ ఉంటుంది. నాలుగేళ్ల క్రితం బుక్‌ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఉండనుంది. టెస్లా ముందుగా మోడల్‌–3 లగ్జరీ కారును ప్రవేశపెట్టనుంది. ఈ కార్ల ధర రూ.55–60 లక్షల వరకు ఉండొచ్చు. డెలివరీలు మార్చి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కారు ఇదే. కంపెనీ తయారు చేసే కార్లలో చాలా తక్కువ ధరకే వస్తోంది. ఒకసారి చార్జ్ చేస్తే 381 నుంచి 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. హైవేలలో పెట్రోల్ పంపులలో కూడా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతోంది. తయారీ లేదా అసెంబ్లింగ్‌ ప్లాంటుతోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని భావిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ధ్రువీకరించారు. ముందుగా సేల్స్ సెంటర్లను ఏర్పాటు చేసి, సేల్స్ ఆధారంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.