చందమామ అసలు రంగు ఇదేనా? మనం చూసేది నిజమేనా?

చందమామ అసలు రంగు ఇదేనా? మనం చూసేది నిజమేనా?

The real color of the moon  : చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ చిన్నప్పుడు అమ్మ చంటాడికి గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలోకి చూపిస్తుంది.. చందమామ కథలు కూడా వినే వింటాం.. మనందరికి కనిపించే చందమామ అసలు రంగు ఎలా ఉంటుంది? చూడటానికి లేత పసుపువర్ణంలో లేదా తెలుపు బింబం మాదిరిగా కనిపిస్తుంది.

అలాగే మధ్యలో నల్లటి మచ్చలతో కూడిన ఆకృతులు కనిపిస్తుంటాయి. చంద్రనిపై కనిపించే ఉపరితల భాగం మాత్రం కచ్చితంగా పసుపు రంగులో లేదా ప్రకాశంతమైన తెలుపువర్ణంలో ఉండదు. చాలా నల్లటి బుడిదరంగులో కనిపిస్తుంది. కొంచెం తెలుపు, నలుపుతో కలిపి మిక్స్ అయి ఉంటుంది. కొంతభాగం నారింజ వర్ణం కూడా కనిపిస్తుంది. ఇదంతా భూవాతావరణంలో నుంచి చూడటం కారణంగానే ఇలా పలు రకాల వర్ణాల్లో కనిపిస్తుందని అంటున్నారు.. మనం ఊహించినట్టుగా మాత్రం ఉండదంటున్నారు.

Moon1కనిపించే రంగు.. అసలు రంగు ఏంటి? :

చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకాంతి నుంచి వెలువడే కిరణాలతో చందమామ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాస్తవానికి చంద్రునిపై అంతా చీకటిగా ఉంటుంది.. చందమామ తానంతట తానుగా కాంతిని ఉత్పత్తి చేయలేదు. 3 శాతం నుంచి 12 శాతం వరకు సూర్యరశ్మి చంద్రునిపై పడటం కారణంగా అది పరావర్తనం చెందుతుంది. భూమి చుట్టూ కక్ష్యలో చంద్రుడు ఉండే స్థానం బట్టి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

భూమి నుంచి చంద్రుని చూస్తే కొన్ని సార్లు ఎరుపు, ఊదా రంగు నుంచి తెలుపుగా లేదా పసుపు వర్ణంలో కనిపిస్తుంది. భూ వాతావరణంలో కలిగే ఆప్టికల్ రిప్లక్షన్ కారణంగానే అలా కనిపిస్తుంది.. అంతేకాని చంద్రునిపై కాదంట.. మరో మాటలో చెప్పాలంటే.. కనిపించే రంగు మాత్రమే.. అసలు చందమామ వర్ణం కానేకాదంట.. చంద్రుని అసలు వర్ణం ఏ రంగులో ఉంటుందో ఈ కింది ఫొటోను చూడండి.. ఇదీ చంద్రుని అసలు రంగు.. ఇలా ఉంటుంది..
చంద్రుని ఉపరితలంపై ఉండే కొన్ని హైలాండ్ ప్రాంతాల్లో రాళ్లు, మట్టిలో ఎక్కువగా ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కాస్తా కాంతివంతంగా కనిపిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం చీకటిగా కనిపిస్తుంది. చంద్రునిపై హైల్యాండ్ రాళ్లు కాస్తా తెల్లగా కనిపిస్తాయి.అందుకే వీటిని pristine హైలండ్ రాక్స్ అని పిలుస్తారు. చాలా అరుదుగా కనిపించే ఈ రాళ్లను అపోలో వ్యోమగాములు సేకరించారు. మారియా ప్రాంతంలో అత్యధిక స్థాయిలో అగ్గిరాయి ఉంటుంది. వాల్కోనిక్ రాళ్లు చాలా నల్లగా ఉంటాయి. భూమిపై కనిపించే రాళ్ల మాదిరిగానే ఈ అగ్గిరాళ్లు (Basalts) ఉంటాయి. ర్యాపిడ్ కూలింగ్ లావాలో మాంగనీస్, ఐరన్ కారణంగా ఈ రాళ్లు ఏర్పడతాయి. అందుకే చాలా నల్లగా కనిపిస్తాయి.