WhatsApp Multi-Device : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఒకేసారి అన్ని డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు!

మెసేంజర్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ అన్ని ఫోన్లలో సపోర్ట్ చేయనుంది. iPhone, Android ఫోన్లతో పాటు desktops వెర్షన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది.

WhatsApp Multi-Device : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఒకేసారి అన్ని డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు!

The Whatsapp Feature Every User Wants Might Be Launching Soon

WhatsApp Multi-Device : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ అన్ని ఫోన్లలో సపోర్ట్ చేయనుంది. iPhone, Android ఫోన్లతో పాటు desktops వెర్షన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. iMessage, Signal మాదిరిగానే మల్టీ డివైజ్ ఫంక్షనాలిటీతో ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ (end-to-end Encryption)తో పనిచేస్తుంది. ఫేస్ బుక్ సొంత యాప్ గా పేరొందిన వాట్సాప్ మెసేంజర్‌కు ప్రస్తుతం ప్రైవసీ వివాదం వెంటాడుతోంది.

అయినప్పటికీ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో ఏమాత్రం వెనుకాడట లేదు. త్వరలో కొత్త ఫీచర్ కూడా మొబైల్, డెస్క్ టాప్ వెర్షన్ లో తీసుకురానుంది. అదే.. WhatsApp multi-device సపోర్ట్ ఫీచర్. చాట్ యాప్స్ లో Multi-device functionality అనేది ఒక బేసిక్ ఫీచర్.. iMessage దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ iOS, macOS, watchOS డివైజ్‌లలో వర్క్ అవుతుంది. ఐఓఎస్ లో అయితే కొత్త డివైజ్ ద్వారా కరెక్ట్ Apple IDతో లాగిన్ కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి వాట్సాప్ డెస్క్ టాప్ ఫంక్షనాలిటీ లేదు. కానీ, ఫోన్ ద్వారా వాట్సాప్ వెబ్ (Whatsapp Web) కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే iPad లో మాత్రం వాట్సాప్ పనిచేయదు. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా ఒకే సమయంలో వేర్వేరు డివైజ్‌లకు సపోర్ట్ చేయనుంది. మీ ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉందా అనే దానితో సంబంధం లేకుండా పని చేస్తుంది. ఒకేసారి అనేక డివైజ్ ల్లో వర్క్ చేసేందుకు ఈ యాప్ అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఫోన్‌ దగ్గరలో లేకపోయినా ఎప్పుడైనా డెస్క్‌టాప్ యాప్ వినియోగించుకోవచ్చు. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ వాట్సాఫ్ బీటా (Whatsapp Beta) యూజర్లకు వచ్చే నెలలో లేదా రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు ఇటీవలే ఫేస్ బుక్ వెల్లడించింది.

ఈ WhatsApp multi-device ప్రారంభంలో పరిమితంగా మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఒకసారి అందుబాటులోకి వచ్చాక కేవలం నాలుగు డివైజ్ లకు మాత్రమే లింక్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మాత్రమే ఫోన్ డివైజ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే.. Non-Phone డివైజ్ ల్లో కూడా QR కోడ్స్ ద్వారా వాట్సాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. WhatsApp multi-device పూర్తిగా అందరి యూజర్లకు అందుబాటులోకి వచ్చేంతవరకు మీరు Beta Program ద్వారా నమోదు చేసుకోవచ్చు. తద్వారా Desktop Beta కోసం WhatsApp Desktop app ఆటోమాటిక్‌గా వాట్సాప్‌గా కన్వర్ట్ అవుతుంది.