Dangerous Android Apps : ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌తో జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పాస్‌వర్డ్ దోచేస్తారు..!

మీ ఫోన్ లో ఈ యాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీకు తెలియకుండానే హ్యాకర్లు మీ పర్సనల్ డేటా, సోషల్ అకౌంట్ల పాస్ వర్డులను తస్కరిస్తారు.. ప్రముఖ గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో malicious apps బయట పడుతున్నాయి.

Dangerous Android Apps : ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌తో జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పాస్‌వర్డ్ దోచేస్తారు..!

These Android Apps Steal People's Facebook Passwords, Delete Them Now

Dangeours Android Apps : మీ ఫోన్ లో ఈ యాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీకు తెలియకుండానే హ్యాకర్లు మీ పర్సనల్ డేటా, సోషల్ అకౌంట్ల పాస్ వర్డులను తస్కరిస్తారు.. ప్రముఖ గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో malicious apps ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవలే కొత్తగా ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ గుర్తించింది. ఈ యాప్స్ ద్వారా వినియోగదారుల ఫేస్ బుక్ యూజర్ నేమ్స్, పాస్ వర్డులను సైబర్ మోసగాళ్లు దోచేస్తున్నారని ఓ నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే ఈ (trojans) యాప్స్‌ను 5 మిలియన్ల కంటే పైగా డౌన్ లోడ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ గూగుల్ ఈ తరహా హానికర యాప్స్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది.

ఒకేవేళ ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్స్ ఇన్ స్టాల్ చేసి ఉంటే వెంటనే డిలీట్ చేయమని హెచ్చరిస్తోంది. Doctor Web రీసెర్చర్లు ఈ Malicious ఆండ్రాయిడ్ యాప్స్ ను గుర్తించారు. ఇందులో ఐదు రకాల మాల్ వేర్ టైప్స్ ఉన్నాయి. JavaScript Codes కూడా వాడుతున్నారట.. ఫేస్ బుక్ (Facebook credentials) ఫైల్ ఫార్మెట్స్ ద్వారా దొంగిలించే రిస్క్ ఉందంటున్నారు సైబర్ టెక్ నిపుణులు.

ఫేస్ బుక్ (Facebook Login) పేజీ ఓపెన్ చేసినప్పుడు ఈ యాప్ సంబంధిత యాడ్స్ డిస్ ప్లే అవుతాయి. ఇన్-యాప్ యాడ్స్ ద్వారా మీకు తెలియకుండానే అకౌంట్ కు సంబంధించిన డేటాను ఎంటర్ చేయగానే.. ఈ యాప్స్ క్లోన్ చేస్తుంటాయి. అనంతరం hackers, C&C servers కు ట్రాన్స్ ఫర్ అవుతుంటుంది. మీరు ఎంటర్ చేసిన వివరాలను malicious apps నుంచి Cookies ద్వారా దొంగలిస్తుంటాయి.

– Horoscope Daily
– Processing Photo
– App Lock Keep
– Rubbish Cleaner
– Horoscope Pi
– App Lock Manager
– Lockit Master
– Inwell Fitness
– PiP Photo

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోకూడదు. ట్రస్టడ్ డెవలపర్స్ నుంచి మాత్రమే ఈ యాప్స్ డౌన్ లోడ్స్ చేసుకోండి. ఒకవేళ ఎలాంటి malicious యాప్స్ కనిపించినా వాటిని క్లిక్ చేయడం గానీ, డౌన్ లోడ్ చేయడం గానీ చేయరాదు. యాప్స్ డౌన్ లోడ్ చేసే ముందు యాప్ రివ్యూలు, రేటింగ్స్ కూడా చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.