Redmi Smartphones : భారత మార్కెట్లో ఈ రెండు రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్.. ఏయే ఫోన్ ధర ఎంతంటే?

Redmi Smartphones : ప్రముఖ షావోమీ (Xiaomi) రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లోకి Redmi సిరీస్ ఎంట్రీ ఇచ్చి ఇటీవలే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. కంపెనీ ఇప్పుడు భారత్‌లో రెండు రెడ్‌మీ ఫోన్‌ల ధరలను అమాంతం తగ్గించింది.

Redmi Smartphones : భారత మార్కెట్లో ఈ రెండు రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్.. ఏయే ఫోన్ ధర ఎంతంటే?

Redmi Smartphones _ These two Redmi smartphones have become cheaper in India

Redmi Smartphones : ప్రముఖ షావోమీ (Xiaomi) రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లోకి Redmi సిరీస్ ఎంట్రీ ఇచ్చి ఇటీవలే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. కంపెనీ ఇప్పుడు భారత్‌లో రెండు రెడ్‌మీ ఫోన్‌ల ధరలను అమాంతం తగ్గించింది. Redmi Note 11, Redmi Note 11S ధరలు రూ. 1,500 వరకు తగ్గాయి. ఈ రెండు మోడళ్ల ధరలు రూ. 13,499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు 4GB RAM, 64GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ. 12,999కు అందుబాటులో ఉంది. అదేవిధంగా, Redmi Note 11S ఇప్పుడు రూ. 15,999 ప్రారంభ ధరతో వస్తుంది. దీని అసలు ధర రూ. 16,499గా ఉంది. Redmi Note 11, Redmi Note 11S రెండూ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో ప్రతి వేరియంట్ కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి.

* Redmi Note 11 (4GB+64GB) – రూ. 12,999 (ధర తగ్గింపు రూ. 500 తర్వాత)
* Redmi Note 11 (6GB+64GB) – రూ. 13,499 (ధర తగ్గింపు రూ. 500 తర్వాత)
* Redmi Note 11 (6GB+128GB) – రూ. 14,499 (ధర తగ్గింపు రూ. 500 తర్వాత)
* Redmi Note 11S (6GB+64GB) – రూ. 15,999 (ధర తగ్గింపు రూ. 500 తర్వాత)
* Redmi Note 11S (6GB+128GB) – రూ. 15,999 (ధర తగ్గింపు రూ. 1,500 తర్వాత)
* Redmi Note 11S (8GB+128GB) – రూ. 16,999 (ధర తగ్గింపు రూ. 1,500 తర్వాత)

Read Also : Redmi Note 12 India : ఇండియాకు రెడ్‌మి నోట్ 12 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?  

Redmi Note 11, Redmi Note 11S రెండింటికీ కొత్త ధరలు ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని గమనించాలి.

Redmi Smartphones _ These two Redmi smartphones have become cheaper in India

Redmi Smartphones _ These two Redmi smartphones have become cheaper in India

రెడ్‌మి నోట్ 11 స్పెసిఫికేషన్స్ :
Redmi Note 11 4G స్మార్ట్‌ఫోన్. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో వస్తుంది. మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. హారిజోన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్‌బర్స్ట్ వైట్. ఈ డివైజ్ 6.43-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లేతో వచ్చింది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌ను అందిస్తుంది. కెమెరా విధులను నిర్వహించడానికి హ్యాండ్‌సెట్ వెనుక 50MP క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంది.

Redmi Note 11S స్పెసిఫికేషన్స్ :
Redmi Note 11S MediaTek Helio G96 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది.1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరాను కలిగి ఉంది. f/1.9 ఎపర్చరుతో 108MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాతో వచ్చింది. సెల్ఫీల కోసం కొనుగోలుదారులు ముందు భాగంలో 16MP కెమెరాను పొందుతారు. ఈ డివైజ్ 5,000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi Note 11 Price : భారత్‌లో రెడ్‌మి నోట్ 11 ధర తగ్గిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!