35ఏళ్ల నాటి మోడిఫైడ్ మారుతీ సుజూకీ 800 ట్రెండీ లుక్ చూశారా?

10TV Telugu News

Maruti Suzuki 800 looks beautiful : భారత కార్ల మార్కెట్లలో మారుతీ కంపెనీ.. మధ్యతరగతి ఫ్యామిలీకి చేరువగా కార్ల మోడళ్ల తయారీని మొదలుపెట్టింది. 1983లో మారుతీ 800 ఎంతో పాపులర్ కారు.. అందులో ప్రధానంగా ఫ్యూరిస్టిక్ డిజైన్ (HM అంబాసిడార్, ప్రీమియం పద్మినీ మోడళ్లతో పోలిస్తే) మారుతీ 800 కారు మోడల్ కు ఎంతో క్రేజ్.. భారత కార్ల చరిత్రలో ఐకానిక్ కారు కూడా. సుదీర్ఘ కాలం పాటు భారత మార్కెట్లో కార్ల విక్రయాల్లో మారుతీ 800 సేల్స్ సునామీ సృష్టించింది.
Maruti Suzuki 800 looks beautiful 2014లో మారుతీ 800 మోడల్ కారు తయారీ నిలిచిపోయింది. సరిగ్గా మారుతీ 800 ఫస్ట్ జనరేషన్ మార్కెట్లోకి వచ్చి 35ఏళ్లు అవుతుంది. ఇప్పుడా మారుతీ మోడల్ 800 మోడిఫై చేశాక ఎంత కలర్ ఫుల్ గా కనిపిస్తుందా చూడండి.. మోడిఫై చేసిన మారుతీ 800 మోడల్ కారు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్_మ్యాథ్యూ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ మారుతీ 800 మోడల్ ఫొటోలను షేర్ చేశారు.
మారుతీ ఫస్ట్ జనరేషన్ మారుతీ 800 లేదా మారుతీ SS80అని క్యాప్షన్ పెట్టారు. కారంతా కొత్త పెయింట్ Nardo Grey Paintతో దగదగ మెరిసిపోతోంది. కారు ఫ్రంట్ సైడ్ లో గ్రిలే మల్టీపుల్ హార్జింటెల్ స్లాట్ అట్రాక్టివ్ గా ఉంది. ఇక స్వెయిర్ హెడ్ ల్యాంప్స్ రౌండ్ యూనిట్లలో అమర్చారు. ఈ మోడిఫై చేసిన మారుతీ 800 కారును కొన్ని యాంగిల్స్ లో చూస్తే అచ్చం Volkswagen Polo కారు మాదిరిగానే లుక్ కనిపిస్తోంది.

ఫ్రంట్ బంపర్ కూడా మోడిఫై చేశారు. 1983లో లాంచ్ అయిన ఈ మారుతీ 800 కారు దేశంలో అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.47,500గా ఉండేది. ఫస్ట్ బ్యాచ్ మారుతీ 800 కారును CKD యూనిట్లతో భారత్ కు దిగుమతి చేసింది కంపెనీ. 2014లో ఆల్టో కారు మార్కెట్లోకి రావడంతో ఈ కారు మోడల్ నిలిచిపోయింది. అయినప్పటికీ మారుతీ 800 కార్లపై కస్టమర్ల ఆసక్తి ఎంతమాత్రం తగ్గలేదు.