Android Phones : ఈ యాప్ ఉంటే చాలు.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఐఫోన్ 14ప్రోలా మార్చేయొచ్చు..!

Android Phones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవల ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను ప్రారంభించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే.. డైనమిక్ ఐలాండ్ (Dynamic Island notch) అనే కొత్త నాచ్ డిజైన్.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడల్స్‌లో మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.

Android Phones : ఈ యాప్ ఉంటే చాలు.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఐఫోన్ 14ప్రోలా మార్చేయొచ్చు..!

This app brings iPhone 14 Pro-like Dynamic Island notch to Android phones

Android Phones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవల ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను ప్రారంభించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే.. డైనమిక్ ఐలాండ్ (Dynamic Island notch) అనే కొత్త నాచ్ డిజైన్.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడల్స్‌లో మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే, మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ అయితే.. మీరు కూడా ఈ డిజైన్ వంటి డైనమిక్ ఐలాండ్‌ని పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐఫోన్ ఫీచర్ ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే దానికి మార్గం ఉంది.

ఆపిల్ డైనమిక్ ఐలాండ్‌ను ప్రకటించిన వెంటనే.. ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు రియల్‌మి (Relame), షియోమి (Xiaomi) ఇదే ఫీచర్‌పై పని చేస్తున్నామని చెబుతున్నారు. అయితే, ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకూ ఆండ్రాయిడ్ ఫోన్‌లు డిజైన్ వంటి డైనమిక్ ఐలాండ్‌ను పొందలేమా? అంటే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డైనమిక్ ఐలాండ్‌ను పొందేందుకు మీరు Google Play స్టోర్‌లో ఒక యాప్ ద్వారా ప్రయత్నించవచ్చు.

This app brings iPhone 14 Pro-like Dynamic Island notch to Android phones

This app brings iPhone 14 Pro-like Dynamic Island notch to Android phones

ఈ యాప్‌ను డైనమిక్‌స్పాట్ (DynamicSpot) అని పిలుస్తారు. డెవలపర్ జావోమోచే (Jawomo) ఈ యాప్ డెవలప్ చేశారు. డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్ వంటి iPhone 14 Proని పొందేందుకు ఈ యాప్ Android యూజర్లకు సాయపడుతుంది. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? తెలుసా? DynamicSpot యాప్ ఫ్రంట్ కెమెరాకు దగ్గరగా iPhone 14 Pro Dynamic Island మాదిరిగానే పిల్-ఆకారపు కటౌట్‌ను సెట్ చేస్తుంది.

మీ Android డివైజ్‌లో మల్టీ టాస్క్ కోసం నోటిఫికేషన్‌లపై కొన్ని అద్భుతమైన ఆప్షన్లతో యాప్ వచ్చింది. ఈ యాప్ డెవలపర్ చాట్, మ్యూజిక్, టైమర్‌తో సహా అన్ని ఆండ్రాయిడ్ యాప్‌ల కోసం డైనమిక్‌స్పాట్ యాప్ పనిచేస్తుందని చెప్పారు. మీరు పిల్ ఆకారపు ఐలాండ్ నోటిఫికేషన్‌లు, షార్ట్‌కట్‌లను సెట్ చేయవచ్చు. ఇంతకీ యాప్ ఎలా పని చేస్తుంది.. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో డైనమిక్ ఐలాండ్‌ని ఎలా పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

* Google Play Storeని ఓపెన్ చేయండి.
* Jawomo ద్వారా DynamicSpot యాప్‌ని సెర్చ్ చేయండి.
* మీ ఫోన్‌లో ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
* యాప్‌ని ఓపెన్ చేసి.. అవసరమైన అన్ని అనుమతులను అంగీకరించండి. సెటప్ కోసం Next‌పై క్లిక్ చేయండి.
* మీరు మీ ఫోన్ నాచ్ ఎక్కడ ఉందో దాని ఆధారంగా లొకేషన్ డివైజ్ కూడా అడ్జెస్ట్ చేయవచ్చు.
* Popup Settings > డైమెన్షన్‌లకు వెళ్లండి.
* మీరు మీ ఫోన్ నాచ్ లేదా పిల్‌తో కనెక్ట్ అయ్యేవరకు 3 స్లయిడర్‌లను అడ్జెస్ట్ చేయండి.
* మీరు మల్టీ టాస్కింగ్ కోసం బబుల్స్ యాడ్ చేసేందుకు ఇతర సెట్టింగ్‌లను కూడా కస్టమైజ్ చేయవచ్చు.

This app brings iPhone 14 Pro-like Dynamic Island notch to Android phones

This app brings iPhone 14 Pro-like Dynamic Island notch to Android phones

ముఖ్యంగా, మరిన్ని ఫీచర్‌లను ఉపయోగించేందుకు మీరు రూ. 99 ధరతో యాప్ Pro వెర్షన్‌ను కొనుగోలు చేయాలి. అధునాతన ఫీచర్‌లలో లాక్ స్క్రీన్‌పై ఐలాండ్ డిస్‌ప్లేతో పాటు సింగిల్ ట్యాప్, లాంగ్ ప్రెస్ వంటి కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. DynamicSpot యాప్ మధ్యలో నాచ్ చాలా Android ఫోన్‌లతో కచ్చితంగా పని చేస్తుంది. కానీ, మీరు OnePlus Nord వంటి స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే.. కెమెరా కట్‌అవుట్‌తో బబుల్‌ను కలపడం కష్టమని గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Android to iOS : వాట్సాప్ ఆండ్రాయిడ్ చాట్ నుంచి ఐఓఎస్‌కు సింపుల్‌గా ఇలా మార్చుకోవచ్చు..!