Internet History : మీ ఇంటర్నెట్ డేటాను శాశ్వతంగా డిలీట్ చేయొచ్చు!

ఇంటర్నెట్ ను ఉపయోగించిన తర్వాత పర్మినెంట్ గా డిలీట్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆ దేశం. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లును UK పౌరులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు చట్టాన్ని రూపొందిస్తోంది.

Internet History : మీ ఇంటర్నెట్ డేటాను శాశ్వతంగా డిలీట్ చేయొచ్చు!

Internet

Internet History : ఇంటర్నెట్..ప్రస్తుతం దీనిపైనే చాలా మంది ఆధార పడుతుంటారు. ఏది కావాలన్నా..ఏది అవసరం వచ్చినా..ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అయితే..వారి గోప్యత సమాచారంపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. తమ సమాచారం..ఎక్కడ తెలుస్తుందోనన్న భయం అందరిలోను ఉంటుంది. ఏదైనా ఆర్డర్, సెర్చ్ చేసినా..ఏమి చేశారో సెల్ ఫోన్ లో, కంప్యూటర్ లో చూపిస్తుంటుంది. ఇది ఇతరులు చూడకుండా ఉండేందుకు హిస్టరీని డిలీట్ చేస్తారు. అయితే..సంబంధిత సమాచారం వారి దగ్గర ఉండిపోతుంది.

ప్రజల గోప్యత ప్రధానంగా భావిస్తూ..ఈ నిర్ణయం తీసుకొంటోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే…ఇంటర్నెట్ వినియోగించే వారు..18 ఏళ్ల వయస్సు కంటే ముందున్న వారు డేటాను పూర్తిగా తొలగించే హక్కు ఇవ్వనున్నారు. 18 ఏళ్ల పైబడి ఉన్న వారు తమ గోప్యత సమాచారం ఇతరులకు తెలియచేయకుండా ఉండేందుకు ఆప్షన్ ఇవ్వనున్నారు. U.K.’s conservative party ఈ బిల్లును తీసకొస్తోంది. సోషల్ మీడియాలో ప్రధాన భూమిక వహించే ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర మీడియా సైట్లు ఏదైనా డేటాను పూర్తిగా తొలగించే హక్కును ఇవ్వనుంది. అయితే..గతంలో కూడా ఇంటర్నెట్ వినియోగదారులకు హక్కులను ఇవ్వడానికి ప్రయత్నించింది. అప్పటికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మరి..ఇది ఎంత కార్యరూపం దాలుస్తుందో చూడాలి.