Black Hole: బ్లాక్ హోల్ నుంచి వచ్చే శబ్దం వినాలని ఉందా? అయితే.. ఇది మీ కోసమే!

‘బ్లాక్ హోల్’ గురించి పరిశోధనలు జరుపుతున్న అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. బ్లాక్ హోల్ దగ్గర వినిపించే శబ్దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.

Black Hole: బ్లాక్ హోల్ నుంచి వచ్చే శబ్దం వినాలని ఉందా? అయితే.. ఇది మీ కోసమే!

Black Hole: బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలం) గురించి చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. ఇవి శాస్త్రవేత్తలకు ఎప్పుడూ అంతుచిక్కని రహస్యాలే. ఎంత శోధించినా.. వీటి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం బ్లాక్ హోల్స్ గురించి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.

Honey Trapping: హనీ ట్రాపింగ్‌కు పాల్పడ్డ యూట్యూబ్ కపుల్.. వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలు వసూలు

ఈ పరిశోధనల్లో అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు ముందుంటారు. వారు తాజాగా బ్లాక్ హోల్ నుంచి వెలువడే శబ్దాన్ని గుర్తించారు. ఈ శబ్దాన్ని రికార్డు కూడా చేశారు. అయితే, ఇది నేరుగా వచ్చే శబ్దం కాదు. కాంతి ప్రతిధ్వనులను ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి శబ్దాలుగా మార్చారు. కాంతి ఎకోస్ (శబ్ద ప్రతిధ్వనులను) సోనిఫికేషన్ శబ్దంగా మార్చినట్లు నాసా సైంటిస్టులు వెల్లడించారు. వివిధ రకాల కాంతి తరంగాల్ని క్రోడీకరించి శబ్దాలుగా మార్చారు. బ్లాక్ హోల్ నుంచి వెలువడే శబ్దం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాసా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రిలీజ్ చేసిన సౌండ్ వినాల్సిందే.

బ్లాక్ హోల్ భూమి నుంచి 7,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఇది సూర్యుడికంటే 5-10 రెట్లు పెద్దది. దీని పరిధిలోకి వచ్చే దేన్నైనా బ్లాక్ హోల్ ఆకర్షించి, తనలో కలిపేసుకుంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa)