Thomson India : థామ్సన్ ఇండియా 50 అంగుళాల 4K స్మార్ట్‌టీవీపై అదిరే ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Thomson India : థామ్సన్ ఇండియా నుంచి కొత్త 4K స్మార్ట్‌టీవీ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర రూ. 22,999కు అందుబాటులో ఉంది. ఇలాంటి స్పెసిఫికేషన్లతో 43-అంగుళాల టీవీని కూడా లాంచ్ చేసింది.

Thomson India : థామ్సన్ ఇండియా 50 అంగుళాల 4K స్మార్ట్‌టీవీపై అదిరే ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Thomson India launches 50-inch 4K smart TV with Google TV OS

Thomson India : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ ఇండియా (Thomson India) బ్రాండ్ లైసెన్సీ (SPPL) భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఇందులో 50-అంగుళాల 4K LED టీవీ కేవలం రూ. 27,999కు అందిస్తోంది. ఇలాంటి స్పెసిఫికేషన్లతో 43 అంగుళాల టీవీని కూడా రూ.22,999కి లాంచ్ చేసింది. ఈ కొత్త టీవీలు ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్‌లతో ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రెడీగా ఉన్నాయి. 4K టీవీలను పక్కన పెడితే.. థామ్సన్ ఇండియా థామ్సన్ FA సిరీస్‌లో 3 కొత్త HD ఫుల్-HD రిజల్యూషన్ స్మార్ట్ టీవీలను కలిగి ఉంది. 32, 40, 42-అంగుళాలతో మూడు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి.

థామ్సన్ 4K LED TV స్పెసిఫికేషన్‌లు :
రెండు కొత్త థామ్సన్ 4K TV Google TV OS ద్వారా పవర్ అందిస్తాయి. ఎంపిక చేసిన థామ్సన్ స్మార్ట్ టీవీలలో కూడా అందుబాటులో ఉన్నాయి. టీవీలు స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంటాయి. వ్యూ, ఆడియో ఎక్స్‌పీరియన్స్ డాల్బీ విజన్ HDR 10+, డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS ట్రూసరౌండ్‌కు సపోర్టు అందిస్తాయి.

Read Also : iPhone 15 Series : యూఎస్‌బీ టైప్-c పోర్టుతో ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

ఈ టీవీలలో 40W స్పీకర్లు, 2GB RAM, 16GB స్టోరేజీ, డ్యూయల్-బ్యాండ్ (2.4GHz + 5GHz) Wi-Fi వంటి బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. (Chromecast)కు సపోర్టు కూడా అందిస్తుంది. వినియోగదారులు తమ ల్యాప్‌టాప్/మొబైల్‌ను టీవీతో ఈజీగా కనెక్ట్ కావొచ్చు. థామ్సన్ 4K టీవీలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి యాప్‌లతో ఉంటాయి. ఈ ప్యాకేజీలో బ్లూటూత్ రిమోట్ ఉంది.

Thomson India launches 50-inch 4K smart TV with Google TV OS

Thomson India launches 50-inch 4K smart TV with Google TV OS

ఇందులో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం హాట్‌కీలు ఉన్నాయి. యాప్‌లు, వీడియోలను లాంచ్ చేసేందుకు వాయిస్ కంట్రోల్‌ని ఎనేబుల్ చేసేందుకు (Google Assistant) కోసం షార్ట్‌కట్ కీ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా, కొత్త థామ్సన్ 4K టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. మొదటి ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. గరిష్టంగా రూ. 1,500 తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ రూ. 8వేలు, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై వర్తిస్తుంది. రెండవ ఆఫర్ (HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై ఫ్లాట్ రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ రూ. 15వేలు అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై వ్యాలిడిటీ అందిస్తుంది.

థామ్సన్ FA TV సిరీస్ ఫీచర్లు :
కొత్త FA సిరీస్‌లో Realtek ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 OS అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి. ఇతర ముఖ్య ఫీచర్లలో లో డిజైన్, 30W స్పీకర్లు, డాల్బీ డిజిటల్, ఇంటర్నల్ నెట్‌ఫ్లిక్స్ ఫీచర్లను అందిస్తుంది. స్మార్ట్‌టీవీ యూజర్లు (Google Play) యాప్ స్టోర్ ద్వారా Prime Video, Disney+ Hotstar, Apple TV, Voot, Zee5, Sony Livతో సహా 6వేల కన్నా ఎక్కువ యాప్‌లు, గేమ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. అన్ని కొత్త థామ్సన్ టీవీలు ప్రతి యూజర్ కోసం కేటగిరీ చేసిన హోమ్ స్క్రీన్‌లు, సిఫార్సులను అందిస్తాయి. వినియోగదారుల కంటెంట్ లిమిట్‌తో పిల్లల ప్రొఫైల్‌లను కూడా క్రియేట్ చేయొచ్చు. ఆన్-బోర్డ్ ప్రాసెసర్ కూడా కలిగి ఉంది.

Read Also : Amazon Revolution 5G Sale : అమెజాన్ 5G సేల్.. శాంసంగ్, రెడ్‌మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!