వాట్సాప్ టిప్స్-ట్రిక్స్ : డిలీట్ అయిన మెసేజ్‌లను ఎలా పొందాలో తెలుసా?

వాట్సాప్ టిప్స్-ట్రిక్స్ : డిలీట్ అయిన మెసేజ్‌లను ఎలా పొందాలో తెలుసా?

deleted WhatsApp messages : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్ లను కొన్ని వాట్సాప్ టిప్స్ ట్రిక్స్ ద్వారా తిరిగి పొందవచ్చు. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లలో వాట్సాప్ చాట్ బాక్సులో డిలీట్ అయిన గ్రూపులో లేదా వ్యక్తిగత చాట్ మెసేజ్ లను ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు.

డిలీటెడ్ మెసేజ్ లను తిరిగి పొందాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో థర్డ్ పార్టీ యాప్ అందుబాటులో ఉంది.

అదే.. WhatsRemoved+ యాప్. 4.090MB సైజు ఉన్న యాప్ ను వైఫై కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. దీనిద్వారా డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్ లను తిరిగి చదవొచ్చు. అదేలానో ఓసారి లుక్కేయండి..

– WhatsAppRemoved+ థర్డ్ పార్టీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

– Wi-fi కనెక్షన్ ద్వారా యాప్ ఇన్ స్టాల్ చేయండి.

– టర్మ్స్ అండ్ కండీషన్స్ యాక్సప్ట్ చేయండి.

– ఏ మెసేజ్ లు సేవ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.

– ఆల్ డిలీటెడ్ మెసేజ్ ఆప్షన్ ఎంచుకోండి. ఎనేబుల్ చేయండి.

– కంటిన్యూపై క్లిక్ చేయండి.

– ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సహా ఇతర ఆప్షన్లు కనిపిస్తాయి.

– డిలీట్ మెసేజ్ లు సేవ్ చేయాలా? లేదా అడుగుతుంది.

– డిలీట్ అయిన మెసేజ్ లన్నీ ఒకేచోట కనిపిస్తాయి.

– స్ర్కీన్ పై డిస్ ప్లే అయిన డిలీట్ మెసేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

– ఆప్షన్ ఎనేబుల్ అయ్యాక డిలీట్ మెసేజ్ అన్నీ కనిపిస్తాయి.