Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..

మీలో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, లేదా ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోయి సమస్య ఎదుర్కొని ఉండొచ్చు. అయితే దానికి పరిష్కారంగా ఆఫ్ లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా..

Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..

Upi Payment

Offline UPI: మీలో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, లేదా ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోయి సమస్య ఎదుర్కొని ఉండొచ్చు. అయితే దానికి పరిష్కారంగా ఆఫ్ లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా..

*99# డయల్ చేయాలి. అప్పుడు మీకు మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ చాలా హెల్ప్ ఫుల్ గా పనిచేస్తుంది. యూజర్ రిక్వెస్ట్ మేరకు డబ్బులు పంపుకోవడానికి, యూపీఐ పిన్ మార్చుకోవడానికి, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మార్చుకోవడానికి ఇంటర్నెట్ అవసరం లేకుండా ఉపయోగపడుతుంది.

*99# సర్వీసుతో 83లీడింగ్ బ్యాంకులు ఇండియా వ్యాప్తంగా కనెక్ట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా 4టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కూడా వారితో కలిసి చేస్తున్నారు. 13విభిన్నమైన భాషలైన హిందీ, ఇంగ్లీష్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఆఫ్‌లైన్ రిజిష్టర్ చేయడానికి పద్ధతి ఇలా:

బ్యాంకుతో రిజిష్టర్ అయి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయండి.

కావాల్సిన భాషను ఎంచుకోండి.

మీ బ్యాంకు పేరు ఎంటర్ చేయండి. అప్పుడు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకుల జాబితాను చూపిస్తుంది.

వాటిల్లో ఒకటి ఎంచుకోండి.

అప్పుడు సంబంధిత బ్యాంకు డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలు ఎంటర్ చేయండి.

ఎక్స్‌పైరీ డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

సక్సెస్ ఫుల్ గా సెట్ చేశాక ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నగదు బదిలీ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ పేమెంట్ చేయడానికి పద్ధతి ఇలా:

బ్యాంకుతో రిజిష్టర్ అయి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయండి.

డబ్బులు పంపేందుకు 1 ఆప్షన్ ఎంటర్ చేయండి.

ఎవరికైతే డబ్బులు పంపాలో వారి యూపీఐ ఐడీ/ ఫోన్ నెంబర్/ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయండి

టోటల్ అమౌంట్ ఎంటర్ చేయండి

యూపీఐ పిన్ నమోదు చేయండి.

ఈ ప్రక్రియ పూర్తయితే పేమెంట్ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది.

ఇలా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ. 0.50 ఛార్జ్ అవుతుంది.