Top Smartphones in 2021: 2021లో వచ్చిన టాప్ ఫోన్స్: మీ ఫోన్ ఉందా?

కోవిడ్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవడం, విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడంతో స్మార్ట్ ఫోన్ లేకుండా ఆయా పనులను చక్కబెట్టడం అసాధ్యం అయింది

Top Smartphones in 2021: 2021లో వచ్చిన టాప్ ఫోన్స్: మీ ఫోన్ ఉందా?

Smartphones

Top Smartphones in 2021: స్మార్ట్ ఫోన్స్ కి 2021 బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. కోవిడ్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవడం, విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడంతో స్మార్ట్ ఫోన్ లేకుండా ఆయా పనులను చక్కబెట్టడం అసాధ్యం అయింది. దీంతో భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. దానికి తోడు నయా ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్ లు వినియోగదారులను ఊరిస్తుండగా, ఎడాపెడా ఫోన్ లు కొనేస్తున్నారు వినియోగదారులు. 2021లో అనేక స్మార్ట్ ఫోన్ లు విడుదలయ్యాయి. ప్రీమియం, మిడ్ రేంజ్, బడ్జెట్ రేంజ్ లలో అనేక స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారుల ఓటు మాత్రం కొన్ని ఉత్తమ ఫోన్లకే పడింది. మరి 2021లో వివిధ సెగ్మెంట్లలో వచ్చిన టాప్ ఫోన్స్ ఏమిటో చూసేద్దాం.

Also Read: New Smartphone: అదిరిపోయే ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్: టెక్నో స్పార్క్ 8

ప్రీమియం సెగ్మెంట్: రూ.60 వేలు ఆపై విలువగల స్మార్ట్ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. ఇందులో ఈఏడాది టాప్ గా నిలిచింది యాపిల్ ఐఫోన్ 13 ప్రో మాక్స్. ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఫీచర్స్ పరంగా బాగా ఆకట్టుకుంది. దీంతో అత్యధికమంది ఈ ఫోన్ కోనేందుకు ఇష్టపడ్డారు. ప్రీమియం సెగ్మెంట్ లో మిగతా ఫోన్లను చూస్తే శామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా, శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్3 మరియు Z ఫ్లిప్3, వీవో X70 ప్రో+, వన్‌ప్లస్ 9 ప్రో ఫోన్ లు టాప్ లో నిలిచాయి.

మిడ్ రేంజ్: రూ. 30 వేలు నుంచి రూ. 45 వేలు విలువగల స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లోకి వస్తుంది. ఇందులో ఈఏడాది టాప్ గా నిలిచింది వన్‌ప్లస్ 9ఆర్. సరికొత్త ప్రాసెసర్, సూపర్ డిస్ప్లే, సాలిడ్ ఫీచర్స్ తో వచ్చిన ఈ ఫోన్ ఈఏడాది మిడ్ రేంజ్ లో టాప్ గా నిలిచింది. మిడ్ రేంజ్ లో మిగతా ఫోన్ లను చూస్తే, రియల్‌మి జిటి, శామ్సంగ్ గెలాక్సీ A52s 5జి, వన్‌ప్లస్ నోర్డ్ 2 5జి, పోకో ఎఫ్3 జిటి, శామ్సంగ్ గెలాక్సీ M52 5జి, ఉన్నాయి.

Also read: Extra Milk in Japan: పాలు ఎక్కువగా ఉన్నాయి, తాగేయండి: ప్రజలకు జపాన్ ప్రభుత్వ సూచన

బడ్జెట్ సెగ్మెంట్: రూ. 15 వేలు నుంచి రూ. 25 వేలు విలువగల స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్ లోకి వస్తాయి. ఈ సెగ్మెంట్ లో ఈఏడాది రెండు ఫోన్లకు వినియోగదారులు మొగ్గు చూపారు. iQOO Z5, రెడ్‌మి నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈరెండు ఫోన్లను షావోమి(mi) సంస్థ భారత్ లో విక్రయిస్తుంది. ఇక బడ్జెట్ సెగ్మెంట్ లో మిగతా ఫోన్ లను పరిశీలిస్తే, Poco X3 ప్రో, శామ్సంగ్ A22 5G, రెడ్‌మీ నోట్ 10ఎస్, రియల్‌మీ 8ఐ ఫోన్ లు ఉన్నాయి.

ఇవి ఈ 2021లో విడుదలైన స్మార్ట్ ఫోన్లు. సెగ్మెంట్ వారీగా వినియోగదారుల కొనుగోలు సంఖ్యను ఆధారంగా చేసుకుని ఈజాబితా రూపొందింది. మరి ఈ ఏడాది విడుదలైన టాప్ స్మార్ట్ ఫోన్లలో మీ ఫోన్ ఉందా చెక్ చేయండి.