Airtel, Jio Wi-Fi కాలింగ్ : ఈ 30 స్మార్ట్ ఫోన్లలో మీ ఫోన్ ఉందా?

  • Published By: sreehari ,Published On : January 10, 2020 / 09:53 AM IST
Airtel, Jio Wi-Fi కాలింగ్ : ఈ 30 స్మార్ట్ ఫోన్లలో మీ ఫోన్ ఉందా?

దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది రిలయన్స్ జియో.. అప్పటినుంచి టెలికం పరిశ్రమలో వేగవంతంగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఆఫర్ చేయడంతో యూజర్లంతా జియో బాటపట్టారు.

జియో దెబ్బతో ఇతర టెలికం కంపెనీలు తమ యూజర్లను ఆకర్షించేందుకు డేటా ధరలను తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో ప్రముఖ టెలికం కంపెనీలు పోటాపోటీగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. యూజర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.

ఇటీవలే భారతీ ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ సర్వీసును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ కు పోటీగా రిలయన్స్ జియో కూడా వైఫై కాలింగ్ ఫీచర్ సర్వీసు తీసుకొచ్చింది. ఈ సర్వీసు ద్వారా యూజర్లు ఉచితంగా వైఫై కాల్స్ చేసుకోవచ్చు, ఇతరుల నుంచి వాయిస్ కాల్స్ అందుకోవచ్చు. ఇందుకు యూజర్లు అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే, ఈ వైఫై కాలింగ్ ఫీచర్ అన్ని స్మార్ట్ ఫోన్లకు సపోర్ట్ చేయదు. కొన్ని మోడల్ కాంప్యాటబుల్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఈ సర్వీసు పనిచేస్తుంది. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో అందించే ఈ Wi-Fi కాలింగ్ సర్వీసును సపోర్ట్ చేసే 30 స్మార్ట్ ఫోన్ల జాబితాను మీ కోసం అందిస్తున్నాం. ఇందులో మీ స్మార్ట్ ఫోన్ మోడల్ కూడా ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.

1. iPhone 11 : 
2. Samsung Galaxy Note 10 Plus
3. iPhone 11 Pro
4. Xiaomi Redmi K20 Pro
5. iPhone 11 Pro Max
6. Samsung Galaxy Note 10
7. iPhone XR
8. Samsung Galaxy M30
9.iPhone XS Max
10. Samsung Galaxy S10 Plus
11. iPhone 6s
12. Samsung Galaxy J6
13. iPhone 6s Plus
14. Samsung On 6
15. iPhone 7
16. Samsung A10s
17. iPhone 7 Plus
18. Samsung S10e
19. iPhone SE
20. Samsung Galaxy A30s
21. iPhone 8
22. Samsung M20
23. iPhone 8 Plus
24. Samsung S10
25. iPhone X
26. iPhone XS
27. Xiaomi Poco F1
28. Xiaomi Redmi K20
29. Samsung Galaxy A50s
30. Samsung Galaxy Note 9