టాప్ 5 బెస్ట్ బడ్జెట్ Laptops.. స్పెషల్ ఫర్ స్టూడెంట్స్

  • Published By: sreehari ,Published On : August 27, 2020 / 05:32 PM IST
టాప్ 5 బెస్ట్ బడ్జెట్ Laptops.. స్పెషల్ ఫర్ స్టూడెంట్స్

Top 5 Best Budget Laptops For Students : ఒకప్పుడు PCలదే హవా నడిచేది.. ల్యాప్ టాప్ ల రాకతో ట్రెండ్ మారిపోయింది.. ప్రత్యేకించి విద్యార్థులు ఈజీ క్యారీయర్ కావడంతో ల్యాప్ టాప్ లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాక డెస్క్ టాప్ వాడకం తగ్గిపోయింది.. అందరూ స్మార్ట్ ఫోన్లలోనే దాదాపు అన్ని పనులు పూర్తి చేసేస్తున్నారు..



విద్యపరంగా కొన్ని పనులు చేయాలంటే కచ్చితంగా ల్యాప్ టాప్ ఉండాల్సిందేనని అంటున్నారు టెక్ నిపుణులు.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అవసరం ఎంతో ఉంది.. ప్రాజెక్టులు చేయడానికి పెద్ద స్క్రీన్, ఫిజికల్ కీబోర్డుతో కూడిన  ల్యాప్ టాప్ లను ఎంచుకోవచ్చు.. స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు బెస్ట్ ల్యాప్ టాప్ లు ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయో ఓసారి లుక్కేయండి..

1. ASUS VIVOBOOK S14 (S431FA) :
ఈ ల్యాప్ టాప్ మోడల్.. 14 అంగుళాలు ఉంటుంది.. ఇంటెల్ 8వ జనరేషన్ టెన్ ప్రాసెసర్లు 8GB మెమెరీతో వచ్చింది.. చూడటానికి చాలా సన్నగానూ తేలికగా ఉంటుంది.. ల్యాప్ టాప్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా వేగంగా ఉంటుంది.. SSDతో స్టాండర్డ్ గా పనిచేస్తుంది. HDMI పోర్ట్‌తో పాటు USB-A, USB-Cతో సహా అవసరమైన పోర్ట్‌లను కూడా అందిస్తుంది.
ASUS VIVOBOOK S14 (S431FA)స్పెసిఫికేషన్లు :
OS : విండోస్ 10 హోమ్
Display : 14 “(1920×1080)
Processor : ఇంటెల్ కోర్ ™ i5-8265U ప్రాసెసర్ | NA
Weight : 1.4
Dimension : 18x323x213
Graphics Processor : ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 620
Price : రూ. 54990

2. LENOVO IDEAPAD S340 :
ఈ మోడల్ ల్యాప్ టాప్ కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో.. విద్యార్థులు ఎక్కువగా వినియోగించే ల్యాప్ టాప్ మోడల్ ఇది.. ఇంటెల్ 8వ జెన్ కోర్ సిరీస్ లేదా AMD రైజెన్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.. ఐడియాప్యాడ్ S340 ఐడియాప్యాడ్ 330, ఐడియాప్యాడ్ 330S సామర్థ్యంతో వచ్చింది.
LENOVO IDEAPAD S340ఎడ్యుకేషన్ కోసం వినియోగించే ల్యాప్ టాప్‌ల్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్ కు ఎక్కువగా క్రేజ్ ఉంది. Web Cam కోసం ఫిజికల్ షట్టర్‌ను ఆడటానికి చౌకైన లెనోవా ల్యాప్‌టాప్.. విద్యార్థులకు బాగా నచ్చే ల్యాప్‌టాప్. ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఐటీ నిపుణులకు సరైన ల్యాప్ టాప్ అని చెప్పవచ్చు.. దీని ధర అమెజాన్‌లో రూ. 58,999 వరకు ఉండగా, ఫ్లిప్ కార్ట్ లో రూ.77వేల వరకు ఉంది.


స్పెసిఫికేషన్లు :
OS              : విండోస్ 10 Home
Display       : 14 (1920 X 1080)
Processor    : 8th Gen Intel® Core™ i7 | 1.5
Memory      : 256 GB SSD / 12GB NA
Weight         : 1.69
Dimension   : 323.6mm x 228mm x 17.9mm
Graphics Processor : NVIDIA® GeForce® MX250 వరకు
Price : రూ. 58,999/ రూ. 77,000

3. HP CHROMEBOOK 14 :
ఈ ల్యాప్ టాప్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు.. Chrome OS రన్ అవుతుంది.. అయినా సరే.. వెబ్ బ్రౌజింగ్, ఈమెయిల్‌ను చెక్ చేయడం, వీడియోలను చూసేందుకు వీలుగా ఉంటుంది. విద్యార్థుల కోసం HP Chromebook 14 ల్యాప్‌టాప్ ఎంచుకోవచ్చు.. Chromebook 14 ధృడంగా ఉంటుంది.. విద్యార్థులకు మంచి ల్యాప్‌టాప్‌గా వాడుకోవచ్చు.. ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది కూడా.. అమెజాన్ లో దీని ధర రూ.25,081 నుంచి అందుబాటులో ఉంది.

HP CHROMEBOOK 14

స్పెసిఫికేషన్లు :
OS                     : Chrome
Display            : 14 (1366 X 768)
Processor          : ఇంటెల్ సెలెరాన్ N3350 | 1.4GHz
Memory            : 64 GB NA / 4GBGB DDR4
Weight             : 1.54
Dimension         :  NA
Graphics Processor : ఇంటెల్ HD గ్రాఫిక్స్ 500

4. LENOVO IDEAPAD S145 :
2018 లెనోవా ఐడియాప్యాడ్ 330 మోడల్ కు ఇది పాత వెర్షన్.. లెనోవా ఐడియాప్యాడ్ S145 ల్యాప్ టాప్ మార్కెట్లోకి వచ్చింది.. కొంచెం సన్నగా తేలికగా ఉంటుంది.. లెనోవా ఐడియాప్యాడ్ S 145 రేంజ్ స్పోర్ట్స్ ఇంటెల్ 8వ జెన్ కోర్ సిరీస్ CPUను SSD, HDD ఆప్షన్లతో వచ్చింది.

LENOVO IDEAPAD S145

స్క్రీన్ పరిమాణం 14 అంగుళాలు లేదా 15.6 అంగుళాల వరకు ఉంటుంది. యూనివర్శిటీ విద్యార్థులకు ఇలాంటి మోడల్ ల్యాప్ టాప్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది.. అమెజాన్ లో ఈ మోడల్ ల్యాప్ టాప్ ధర రూ.36,490
వరకు ఉంటుంది.


స్పెసిఫికేషన్లు :
OS                : విండోస్ 10 Home
Display         : 15.6 (1920 X 1080)
Processor    : 8th Gen Intel® Core™ i7 | 1.8
Memory      : 1TB HDD / 4GB DDR4
Weight          : 1.85
Dimension   : 362.2mm x 251.5mm x 19.9mm
Graphics Processor : AMD Radeon Vega 3

5. LENOVO IDEAPAD 330S :
లెనోవా ఐడియాప్యాడ్ 330S క్లాసీ డిజైన్ తో వచ్చింది.. సాలిడ్ బిల్డ్, నాన్-గ్లోసీ డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది.. 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి. బేస్ మోడల్‌లో 4GB ర్యామ్, 1TB HDD ఆధారిత స్టోరేజ్ ఉన్నాయి.

LENOVO IDEAPAD 330S

డిస్ ప్లే ఫుల్ HD నాన్-గ్లేర్ యూనిట్, పలు రంగులను వస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ పర్ఫార్మెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది.. అమెజాన్‌లో దీని ధర రూ.39,490ల నుంచి అందుబాటులో ఉంది.


స్పెసిఫికేషన్లు :
OS                 : Windows 10 Home
Display         : 14 (1920 X 1080)
Processor     : Intel Core i3 (8th gen) | NA
Memory       : 1 TB HDD/4GB NA
Weight         : 323.1 x 234.8 x 18.95
Dimension    : 1.67
Graphics Processor : ఇంటెల్