Adventure Bikes: బడ్జెట్ లో టాప్ అడ్వెంచర్ టూరింగ్ బైక్స్

భారత్ లో దాదాపు అన్ని ద్విచక్ర వాహన సంస్థలు అడ్వెంచర్ బైక్స్ ని తయారు చేస్తున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్ ఏమిటో చూడండి

Adventure Bikes: బడ్జెట్ లో టాప్ అడ్వెంచర్ టూరింగ్ బైక్స్

Advs

Adventure Bikes: అడ్వెంచర్ టూరింగ్ కి వెళ్లాలని ఎవరికి ఉండదు!. ముఖ్యంగా బైక్ పై “ఆఫ్ రొడింగ్” చేసేందుకు యూత్ బాగా ఇష్టపడుతున్నారు. బైక్ పై సుదూరప్రాంతాలకు చేరుకుంటూ మార్గమధ్యలో అనేక ప్రాంతాలను చుట్టేస్తూ సరదాగా సాగిపోయే ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు యువత. అయితే బైక్ పై అడ్వెంచర్ టూరింగ్ కు వెళ్లాలంటే సాధారణ బైక్ లు అంతగా కంఫర్ట్ ఉండవు. ఆఫ్-రోడ్ బైక్స్ సౌకర్యంగా ఉంటాయి. ప్రస్తుతం భారత్ లో దాదాపు అన్ని ద్విచక్ర వాహన సంస్థలు అడ్వెంచర్ బైక్స్ ని తయారు చేస్తున్నాయి. మరి బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్ ఏమిటో చూడండి.

Hero Xpulse 200 4V: దేశీయంగా తయారవుతున్న అడ్వెంచర్ బైక్స్ లో తక్కువ రేటులో ఉన్న బెస్ట్ బైక్ ఇదేనని బైక్ పండితులు చెబుతున్నారు. 200సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్,19bhp పవర్, 17Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ బైక్. 2019లో విడుదలైన ఈ Xpulse 200, యూత్ ని బాగా ఆకట్టుకుంది. సింగిల్ ఛానల్ ABS, ఎయిర్/ఆయిల్ కూలింగ్ సిస్టం వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ బైక్ ఇటీవలే BS6 వెర్షన్ లో 4 వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన Xpulse 200 4V..బైక్ ధర ₹1,28,150 (ex-showroom, Delhi)గా నిర్ణయించారు.

Also read: Terrorists Encounter: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు

Royal Enfield Himalayan: ఇక మొదటి నుంచి అడ్వెంచర్ సెగ్మెంట్ ని శాసిస్తున్నా హిమాలయన్ బైక్..2021లో కొత్త అప్డేట్ తో వచ్చింది. మరింత సాలిడ్ గా, ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ తో వచ్చిన ఈ హిమాలయన్ అడ్వెంచర్ బైక్ లో రారాజుగా నిలిచింది. 400సీసీ సింగిల్ సిలిండర్ తో వచ్చిన ఈ బైక్.. 24 bhp పవర్, 32 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ముందువెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్న ఈ బైక్ ధర ₹2.11 lakh (ex-showroom, Delhi)గా నిర్ణయించారు.

KTM 250 Adventure: యూత్ లో KTM బైక్ లకు ఎంత క్రేజ్ ఉందొ తెలిసిందే. సాలిడ్ ఫీచర్స్ తో, మంచి రైడింగ్ అనుభూతిని పంచుతాయి. ఇక KTMలోనూ అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయి. KTM 390, 250 వేరియంట్లలో అడ్వెంచర్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ పరంగా చూసుకుంటే KTM 250 ఫీచర్స్ బాగున్నాయి. 250సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ 29.5 bhp పవర్ ను, 24 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈమధ్యనే కొత్త అప్డేట్ అందుకున్న ఈ బైక్ ధర ₹ 2,32,645గా నిర్ణయించారు.

Also read: Kiriti Reddy : గాలి జనార్దన్ రెడ్డి తనయుడు హీరోగా పాన్ ఇండియా సినిమా

Benelli TRK 251: ఇటలీ ద్విచక్ర వాహన సంస్థ బెనేలి తన ప్రీమియం రేంజ్ బైక్స్ ను ఇండియన్ మార్కెట్లో మరింత విస్తరిస్తుంది. ఈక్రమంలో ఇండియాలో 250 సీసీ అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్ లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఇక బెనేలి నుంచి ఇటీవలే విడుదలైన అడ్వెంచర్ బైక్ Benelli TRK 251. సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ 25 bhp పవర్ ను, 21 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో మిగతా అన్నీ బైక్ ల కంటే ప్రత్యేకతను చాటుకున్న ఈ Benelli TRK 251 ధర ₹2.51 lakh (ex-showroom)గా నిర్ణయించారు.

Honda CB200X: జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం హోండా ప్రత్యేకంగా ఇండియా మార్కెట్ కోసం తయారు చేసిన బైక్ ఈ Honda CB200X. పాక్షికంగా అడ్వెంచర్ బైక్ గా పేర్కొంటున్న ఈ బైక్, వారాంతాల్లో పర్యటనలకు వెళ్లేందుకు బాగుటుంది. 184సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్,17 bhp పవర్ ను,16 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. USD ఫోర్క్స్ తో వస్తున్న ఈ బైక్ ధర ₹1,44,500 (ex-showroom, Delhi)గా నిర్ణయించారు

Also read: Dog saves Owner: కిడ్నాప్ నుంచి యజమానిని రక్షించిన శునకం