2021లో రూ.10లక్షల లోపు టాప్ SUV కార్లు వచ్చేస్తున్నాయి!

2021లో రూ.10లక్షల లోపు టాప్ SUV కార్లు వచ్చేస్తున్నాయి!

Top SUVs Under Rs 10 lakh Launching in India in 2021 : భారత ఆటోమొబైల్ మార్కెట్ రకరకాల మోడల్ కార్లతో వేగంగా విస్తరిస్తోంది. సరికొత్త మోడళ్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. సబ్ కాంపాక్ట్ మోడల్ SUV కార్లకే ఫుల్ క్రేజ్.. వినియోగదారులంతా ఈ మోడల్ కార్లనే కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

2021 కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త SUV కార్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో రూ.10 లక్షల ధర లోపు SUV ఇందన, ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఇందులో టాప్ SUV కార్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. మీకు నచ్చిన మోడల్ SUV ఎంచుకోండి. లాంచ్ కాగానే కొనేసుకోండి.

Mahindra eKUV100 :
ఈ మోడల్ SUV కారు.. ఎలక్ట్రిక్ వెహికల్.. మినీ SUVలో KUV100 ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా. ఇందులోని కొత్త ఫీచర్లు ఎయిర్ కండీషనింగ్ టెంపరేచర్ సెట్ చేసేలా ఉంటాయి. కారులోకి ఎక్కడానికి ముందే ఈ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు.

Top SUVs Under Rs 10 lakh Launching in India in 2021

ఈ కొత్త కారు పూర్తిగా Hyundai Santro, Hyundai i10 and Datsun GO Plus మోడళ్లకు పోటీగా మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఫిబ్రవరి 2021లో ఈ మోడల్ కార్లు లాంచ్ కానున్నాయి. ఒక్కో SUV మోడల్ కారు ధర రూ.8.25 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Renault Kiger :
ప్రముఖ కార్ల కంపెనీ రెనాల్డ్ నుంచి మరో కోత్త SUV కారు మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. అదే.. Renault Kiger SUV మోడల్ కారు. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా జనవరి 28, 2021న ఆటోమొబైల్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. Nissan Magnite, Triber కారు మోడళ్ల మాదిరిగానే CMFA+ ప్లాట్ ఫాంనే తయారు చేశారు.

Renault Kiger

టాటా నెక్సాన్, కియా సోనెట్, హుందాయ్ వెన్యూ, మారుతీ బ్రెజ్జా, టయోటా అర్బన్ క్రియిజర్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా XUV300 మోడల్ కార్లలో సరసమైన ధరకే రాబోయే ఈ Renault Kiger అల్ట్రానెట్ కారుగా చెప్పవచ్చు. మార్చి 2021లో ఈ Kiger కారు లాంచ్ కానుంది. దీని ధర మార్కెట్లో (ఎక్స్-షోరూం, ఢిల్లీ)తో రూ.5.50 లక్షల వరకు ఉండొచ్చు.

Tata HBX :
ఈ టాటా HBX మోడల్ కారు.. 1.2 లీటర్ల ట్యాంకు, 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఆఫర్ చేస్తోంది. కొత్త SUV కార్లలో మారుతీ సుజూకీ Ignis, మహింద్రా KUV100 NXT మోడళ్లకు మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త Tata HBX మోడల్ కారు మార్చి 2021లో లాంచ్ కానుంది. దీని ధర మార్కట్లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చు.
Tata HBX

Tata Altroz XZ Opt Turbo :
ఈ కొత్త SUV మోడల్ కారు.. 1199CC ఇంజిన్ తో వస్తోంది. 37 లీటర్ల ఇందనం కెపాసిటీతో Tata Altroz XZ Opt Turbo కారు కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేయనుంది. ఈ కారు Skyline Silver, Midtown Grey, High Street Gold, Downtown Red and Avenue White 5 రంగుల్లో వస్తోంది. ఈ టర్బో కారు Maruti Baleno Alpha మోడల్ కు పోటీగా మార్కెట్లోకి రాబోతోంది.
XZ
దీని ధర మార్కెట్లో రూ.7.64 లక్షలుగా ఉంది. అలాగే టాటా టియాగో XZ ప్లస్ డ్యుయల్ డోన్ రూఫ్ మోడల్ ధర రూ.6.24 లక్షలు, హుందాయ్ i20 స్పోర్ట్స్ DT మోడల్ కారు ధర రూ.7.74 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్ XZ Opt Turbo మోడల్ కారు జనవరి 2021 మధ్యలో లాంచ్ కానుంది. దీని ధర మార్కెట్లో రూ.8.75 లక్షల వరకు ఉండొచ్చు.