Toyota: బెంగళూరులో మూడు రోజుల సాహసయాత్రను ప్రారంబించిన టయోటా

ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం, వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం. టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం

Toyota: బెంగళూరులో మూడు రోజుల సాహసయాత్రను ప్రారంబించిన టయోటా

Bangalore: దేశవ్యాప్తంగా మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, మూడు రోజుల సాహసయాత్రకు నాంది పలుకుతూ ఈరోజు ‘గ్రేట్ 4×4 ఎక్స్-పెడిషన్’ ను ప్రారంభించింది టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM). ఈ థ్రిల్లింగ్ డ్రైవ్ ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం, వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం. టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం. ఈ కార్యక్రమం లో పాల్గొనే 4×4 కమ్యూనిటీకి “మాస్ హ్యాపీనెస్” అందించడానికి సిద్ధంగా ఉంది.

Snapchat: ఇండియాలో 20 కోట్లకు చేరుకున్న నెలవారీ స్నాప్‭చాట్ యూజర్లు

టయోటా ఈ గ్రేట్ 4×4 X-పెడిషన్ ను ఈ ఉదయం బెంగళూరు నుంచి ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుంచి 4×4 ఔత్సాహికుల దీనిలో పాల్గొన్నారు. లెజెండరీ Hilux, Fortuner 4×4, LC 300, Hyryder AWD సహా ఇతర SUV బ్రాండ్‌ల వాహనాలను సగర్వంగా సొంతం చేసుకున్న యజమానులు తమ వాహనాల యొక్క నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఆఫ్-రోడింగ్ కి సిద్ధమయ్యారు. ఆఫ్ రోడింగ్ లో ఔత్సాహికులచే నడపబడే 4×4 SUVల యొక్క ఆకట్టుకునే కాన్వాయ్‌, రాబోయే రెండు రోజులలో హసన్ మరియు సకలేష్‌పూర్‌లోని విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తుంది.